అవీ .. ఇవీ..

చల్లని ఫీట్ (అవీ..ఇవీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తైపీలోని ఐస్‌స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ అథ్లెట్ ఇలా వంకీలు తిరిగిపోవడం ఆమెకు కొత్తగాదు. కానీ చూసేవారికి మాత్రం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. తైవాన్‌లోని తైపీలో తరచూ ఐస్‌స్కేటింగ్ పోటీలు నిర్వహిస్తూంటారు. వాటిలో నెగ్గాలంటే ఇలా ప్రాక్టీస్ చేయకతప్పదుమరి.

కళారాధన
కళ అంటే పశ్చిమముంబై ప్రాంతం వారికి ఓ ఆరాధన. సంప్రదాయ కళలు, ఆధునిక సొబగులు కలగలిపి ఏటా అక్కడ ఓ ప్రదర్శన నిర్వహించడం ఆనవాయితీ. ఇక్కడ సినిమా, నాటకం, నాటిక, మ్యాజిక్, పాటలు, ఆటలు, ఆహారం తయారీ, తినడం అన్నింటా పోటీలుంటాయి. వ్యాసరచన, వక్తృత్వం, నృత్యం ఒకటేమిటి అన్నింటా ప్రదర్శనలుంటాయి. పోటీలుంటాయి. చిన్నాపెద్దా అందరికీ నచ్చేలా తొమ్మిదిరోజులపాటు వేడుక నిర్వహిస్తారు. ఇక్కడ ఎవరు ఏ రంగంలో పాలుపంచుకున్నా అందులో కళాత్మకత ఉట్టిపడుతుంది. ఓ మూల ఇద్దరు చిన్నారులు నిల్చుంటే వారికిపూసిన రంగులు ఓ అద్భుతంగా కన్పిస్తాయి. పాతవస్తువులతో తీర్చిదిద్దిన బొమ్మలు కనువిందుచేస్తాయి. డైనింగ్‌టేబుల్ చుట్టూ కూర్చుని విందు ఆరగించడానికి కూర్చున్న భంగిమలే బొమ్మలు పేర్పు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏటా ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభమయ్యే ‘కళాగోధ’ ప్రదర్శనలో కన్పించే ఇలాంటి దృశ్యాలెన్నో..

అంతా కనికట్టు
ఈ మధ్య హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఓ ‘మ్యాజికల్ సీక్రెట్’ ప్రదర్శనలో బౌద్ధ సన్యాసులు ఈ ప్రదర్శన నిర్వహించారు. చూసేవారికి ఇది గొప్ప థ్రిల్ కలుగజేసింది.

చాక్‌లెట్ గర్ల్!
ఫ్యాషన్ షోలో మోడల్స్ వేసే దుస్తులు, వారి వేషధారణ ఆశ్చర్యకరంగా ఉండటంలో విశేషం ఏమీలేదు. ఇదిగో ఈ ఫొటోలో కన్పిస్తున్న అందగత్తె వేసుకున్న డ్రెస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. బ్రస్సెల్స్‌లో జరిగిన చాక్‌లెట్ షోలో ఈ మోడల్ చాక్‌లెట్‌తో తయారుచేసిన గౌను ధరించి క్యాట్‌వాక్ చేసింది. ఇక చూపరులంతా ఆమెను తినేసేట్లు చూడటంలో వింతేముంది.. ఇక న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ప్రఖ్యాత డిజైనర్ తడషి షోజి రూపొందించిన ఓ వినూత్న డిజైన్ డ్రెస్‌తో మరో అందాలభామ కనువిందు చేసింది.