అవీ .. ఇవీ..

చెట్లకు స్వెట్టర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలంలో మనం వెచ్చదనం కోసం స్వెట్టర్లు వేసుకుంటాం. కానీ చైనాలో కొందరు చెట్లను చలి నుంచి రక్షించడం కోసం రహస్యంగా స్వెట్లర్లు, ఊలుదారాలు చుట్టి సంచలనం సృష్టిస్తున్నారు. ప్రధానంగా షెన్‌యాంగ్ పట్టణంలో రాత్రుళ్లు గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చెట్లకు స్వెట్టర్లు అల్లేస్తున్నారు. ఇది కొద్ది సంవత్సరాలుగా ఒక సంప్రదాయంగా మారిపోయింది. చైనాలోని లియాంగ్ ప్రావిన్స్‌లో ఇది ఒక పర్యాటక ఆకర్షణ. చలికాలంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చెట్లకు స్వెట్టర్లు, దుప్పట్లు కప్పితే కప్పొచ్చుకానీ రహస్యం ఎందుకంటారు కొందరు. అయితే తీవ్రమైన చలి నుండి వాటిని కాపాడటాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లకు ఇలా రంగురంగుల స్వెట్టర్లు అల్లడం వల్ల సరికొత్త అందాలతో వీధులు కనిపిస్తున్నాయని మరికొందరు ముచ్చటపడుతూ కెమెరాలకు పని చెబుతున్నారు.

- భారతి