అవీ .. ఇవీ..

ప్రకృతి సోయగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేషనల్ జియోగ్రాఫికల్ సంస్థ ఎప్పటిలా వరల్డ్ నేచర్ ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి నిపుణులైన ఫొటోగ్రాఫర్లు తీసిన అరుదైన, అందమైన ఛాయాచిత్రాలను ఎంట్రీలుగా పంపిస్తున్నారు. ఈ పోటీలో గ్రాండ్ విన్నర్‌కు 7500 అమెరికల్ డాలర్ల మొత్తాన్ని బహుమతి ఇస్తారు. ఛానల్‌లో ఆయా ఛాయాచిత్రాల ప్రదర్శనతోపాటు ఆ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తారు. ఫొటోగ్రాఫర్లకు సంబంధించి ఈ పోటీలో బహుమతులు సాధించడాన్ని ‘ఆస్కార్’ బహమతి గెలిచినట్లుగా భావిస్తారు. అలా పోటీకి వచ్చిన ఫొటోలో కొన్ని...
* పఫిన్ పక్షులు అందంగా ఉంటాయి. వాటికి చేపలంటే ఇష్టం. అలా వచ్చి ఇలా వెడుతూ ఒకటీ అరా చేపలను పట్టుకోవడం వాటికి అసలు ఇష్టం ఉండదు. నోటినిండా పట్టినన్ని చేపలను ఒక వరుసక్రమంలో అమర్చుకుని తీసుకువెళ్లడం వాటికి ఉన్న నేర్పు. స్కాట్లాండ్ మారుమూల ప్రాంతాల్లో ఈదురుగాలులు, మంచు తీవ్రంగా పడుతున్నప్పటికీ పట్టువదలని ఈ అట్లాంటిక్ పఫిన్ నోటినిండా చేపలను కరచుకుని తీరిక లేకుండా గడిపింది. గాలులు నెట్టివేస్తున్నా పట్టుదలగా తన పిల్లల కోసం ఈ చేపల వేట కొనసాగించింది. ఈ అందమైన చిత్రాన్ని సునీల్ గోపాలన్ అనే ఫొటోగ్రాఫర్ తీశాడు.
* ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో చూడాలంటే ఈ ఫొటోను చూస్తే చాలు. అమెరికాలోని కొలరాడోలో ఈ ఏడాది జూన్‌లో వచ్చిన సుడిగాలి బీభత్సం ఇది. అదే సమయంలో పిడుగులు పడటం, సుడిగాలి తీవ్రత భయపెడుతున్నా ఫొటోగ్రాఫర్ కోల్ట్ ఫోర్నె తన లెన్స్‌కు పనిచెప్పాడు. దాని ఫలితమే ఈ అందమైన దృశ్యం.
* ఇక్కడ కనిపిస్తున్న డబుల్ కోర్‌మంట్ జాతి కొంగ నేర్పు చూశారా? తను పట్టుకున్న చేప మింగడానికి వీలుగా గాలిలోకి ఎగరేసి నేరుగా గొంతులోకి జారిపోయేందుకు ప్రయత్నిస్తోంది. ఈ అద్భుత దృశ్యాన్ని గ్యారీ జెంగ్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించాడు.
* ఈ అందమైన చిత్రాన్ని తీసిన ఫొటో గ్రాఫర్ మనీష్ తివారి. దీనికి ‘హార్ట్‌బీట్’ అని పేరుపెట్టాడు. ఎందుకంటే మనిషికి ఇసిసి పరీక్షలు నిర్వహించినప్పుడూ రేఖాచిత్రం ఇలానే ఉంటుందన్నది ఆయన భావన. కొండల్లో మెలికలు తిరిగిన రహదారి ఇలా అందంగా కనిపిస్తోందన్నమాట.