అవీ .. ఇవీ..

అందానికి బహుమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ ఆధ్వర్యంలో ఈ మధ్య 2017 ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించింది. వేలాది ఎంట్రీలు వచ్చాయి. వాటిని పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. బహుమతి పొందిన ఛాయాచిత్రాలను వారి పత్రిక, వారి ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేశారు. మొదటి విజేతకు పదివేల అమెరికన్ డాలర్ల బహుమతి ఇచ్చారు. ఇండోనేసియాలోని బొరెనో ప్రాంతంలో సిగ్గుపడుతూ ఓ చెట్టుచాటున దాక్కుంటున్న ఒరెంగటూన్‌ను చూసి క్లిక్‌మన్పించిన జయప్రకాశ్ భోజన్‌కు మొదటి బహుమతి లభించింది. మెక్సికోలోని యుకాటన్ ప్రాంతంలో సంతతిని వృద్ధి చేసుకునేందుకు వచ్చిన ఫ్లెమింగో పక్షుల, వాటిచుట్టూ ఉన్న వాటి పిల్లల గుంపును చిత్రీకరించిన అలెగ్జాండ్రో రెండో బహుమతిని పొందారు. మూడో బహుమతిని పొందారు. పీపుల్స్ ఛాయిస్‌లో ఓ గుడ్లగూబ దూసుకువస్తున్న దృశ్యాన్ని హేరీ కొలిన్స్ బంధించిన దృశ్యం ఎంపికకాగా, ల్యాండ్‌స్కేప్స్ విభాగంలో హవాయిలో అగ్నిపర్వతం విస్ఫోటన దృశ్యాన్ని కెమెరాలో బంధించిన కరీం చిత్రానికి బహుమతి లభించింది. ప్రకృతి సోయగాలను బంధించినందుకు బహుమతులు దక్కాయంటే బాగుంటుంది కదూ!

- భారతి