అవీ .. ఇవీ..

చిత్రం.. విచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేషనల్ జియాగ్రాఫికల్ ఛానల్ గత నెలలో కొన్ని ప్రసారాల కోసం ప్రపంచం నలుమూలల నుంచి కొన్ని ఛాయాచిత్రాలను తీయించింది. వాటిలో ఇక్కడివి ప్రేక్షకాదరణ పొందాయి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో కనిపించిన ఒకరకపు కుక్కగొడుగులు నిజానికి ఫంగీ. ఇవి కొన్ని రకాల జీవులకు ఆహారం. ఇదేదో చిత్రకారుడు గీసిన బొమ్మలా ఉంది కదూ! ఈ చిత్రాన్ని లాన్స్ ఐజాక్సన్ తీశాడు. ఇక భారత్‌లోని మమల్లాపురంలో ఓ బెంగాలీ యువతి వివాహం సందర్భంగా ఓ రెండు చేపలను బహుమతిగా అందుకుంది. వాటిని ఇలా చూపిస్తూ ఆనందాన్ని చాటుతోంది. ఇలా చేపల బహుమతి ఇక్కడి సంప్రదాయం. ఈ చిత్రాన్ని బ్రెయిన్ కాల్‌కవాస్ తీశాడు. ఇక ఫ్రాన్సిస్కో మైంగ్రాన్స్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ ‘ది ట్రూ స్వింగ్’ చిత్రంలో ఓ మకావూ జాతి కోతి స్వేచ్ఛగా ఊగుతున్న దృశ్యం చూపరులను కట్టిపడేసింది.