అవీ .. ఇవీ..

చిత్ర విచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫొటోగ్రఫీ ఒక కళ. కళ్లముందు అనుకోకుండా కనిపించే అందమైన, వింతైన దృశ్యాన్ని నాణ్యంగా, ఆకట్టుకునేలా చిత్రీకరించడం మామూలు విషయం కాదు. అననుకూల పరిస్థితులు, ప్రాంతాల్లో తమ ప్రతిభాపాటవాలను కళ్లకు కట్టించే ఫొటోగ్రాఫర్లకు ఈ మధ్య ఓ పోటీ నిర్వహించారు. ప్రపంచ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పోటీలకు వేలాది ఎంట్రీలు వచ్చాయి. వాటిలో ఇవి కొన్ని. వైల్డ్‌లైఫ్ సీనియర్ ఫొటోగ్రాఫర్ల విభాగంలో జస్టిన్ హాఫ్‌మన్ తీసిన ఈ చిత్రం ఫైనల్స్‌కు ఎంపికైంది. సముద్ర జలాల్లో తేలియాడుతున్న ఓ ప్లాస్టిక్ ఇయర్‌బగ్ (చెవి శుభ్రం చేసుకునే పుల్ల)ను ఆసరా చేసుకుని నీటిలో తేలియాడుతున్న సీహార్స్‌ను కెమెరాలో బంధించాడు అమెరికాకు చెందిన జస్టిన్. అదే దేశానికి చెందిన పదకొండేళ్ల యువ ఫొటోగ్రాఫర్ తీసిన బేర్‌హగ్ పొటోకూడా ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
అమెరికాలోని స్కల్లీకి చెందిన ఆష్‌లీ ఓ ఎలుగుబంటి కూన తల్లిని పట్టుకుని ముద్దాడుతున్న దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఇలాంటివే మరెన్నో చిత్రాలు పోటీలో ఫైనల్స్‌కు ఎంపికయ్యాయి.

- భారతి