బిజినెస్

మరో దశాబ్దం చాలు.. ఏవియేషన్‌లో మనదే అగ్రస్థానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విమానాల వ్యాపారానికి భారత్ ఎంతో అనువైంది : పలు సంస్థల ఉద్ఘాటన
హైదరాబాద్, మార్చి 17: వచ్చే పదేళ్లలో భారత వైమానిక రంగం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలువనుందని, విమానాల తయారీకి భారత్ అనువైన ప్రదేశమని పలు విమానయాన సంస్థలు ప్రశంసించాయి. ఈ రంగం మరింత విస్తరించాలని కాంక్షించాయి. ఏవియేషన్ ఇండియా-2016 సదస్సులో పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఎయిర్ బస్ ప్రతినిధి శ్రీనివాసన్ మాట్లాడుతూ భారత్ విమానయాన రంగంలో అభివృద్ధి చెందుతుందని, మార్కెట్‌లో ఎయిర్‌బస్‌కు మంచి స్పందన ఉందన్నారు. 4.6శాతం వృద్ధితో నడుస్తున్న సంస్థ వచ్చే 20 ఏళ్లలో పేద, మధ్యతరగతుల ప్రయాణికుల అనుకూలంగా ఉండే విధంగా ధరలు ఉంటాయన్నారు. గత నలభై ఏళ్లుగా ప్రయాణికులకు మంచి సౌకర్యం కల్పిస్తున్న ఎయిర్‌బస్ భవిష్యత్‌లో సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మేక్ ఇన్ ఇండియాకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎంబ్రాయర్ ఎగ్జిక్యూటివ్ జెట్స్ సేల్స్ ఉపాధ్యక్షుడు క్లాడియో కెమిలియర్ మాట్లాడుతూ ఎయిర్ క్రాఫ్ట్‌ల అమ్మకాలకు, తయారీకి భారత్ ఇస్తున్న ప్రోత్సాహం మంచిదేనని, దీంతో విమాన ప్రయాణం అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఉంటుందన్నారు. టైటాన్ ఏవియేషన్ గ్రూపుతో ఫ్యూనమ్ 100ఇ ఎయిర్ క్రాఫ్ట్‌ల ఆర్డర్లు వచ్చాయని, హైదరాబాద్‌లోని సదస్సు ఈ ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 330 ఫ్యూనమ్ 100, మరో 100 ఇ జెట్స్ వరకు డెలివరి చేసినట్టు ఆయన వివరించారు. 1969లో స్థాపించబడిన సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 8వేల ఎయిర్ క్రాఫ్ట్‌లు కలిగి ప్రతి పది సెకన్లకు ఒక చాప్టర్ ప్రయాణికులకు అందుబాటులో ఉందన్నారు. 130 సీట్లు కలిగిన ఎంబ్రాయర్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్‌లు 90 దేశాలలో ఏటా 145 మిలియన్ల ప్రయాణికులను చేరవేస్తుందని తెలిపారు. మాయిని గ్రూప్ కంపెనీ వైస్ చైర్మన్ జివి సంజయ్ రెడ్డి 25-టన్ ఎలక్ట్రానిక్ టౌటగ్‌ను ప్రారంభించారు. తమ సంస్థ చేపట్టిన విమాన పరిశ్రమలకు ఉపయోగపడే ఎలక్ట్రిక్ ఉత్పత్తులకు మంచి స్పందన లభిస్తుందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ మాయిని మాట్లాడుతూ 30ఏళ్ల అనుభవంతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన తమ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయన్నారు. గుజరాత్ విమానయాన సంస్థ అంఖేశ్వర్‌లో ఎమ్‌ఆర్‌ఓ (మెయింటెనెన్స్ రిపేర్ ఆలోవర్) ఏర్పాటు చేసేందుకు శాసన సభలో ప్రతిపాదించామని, ఈ మేరకు బడ్జెట్‌లో రూ. 20కోట్లు కేటాయించనున్నట్టు డైరెక్టర్ శర్మ తెలిపారు. హంస్ పవన్ సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ ఎమ్‌ఆర్‌ఓకు హిందుస్థాన్ ఎరోబొటిక్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు.
(చిత్రం) ఇండియా ఏవియేషన్ ఎక్స్‌పో-2016లో గురువారం ఒక విమాన నమూనాను ప్రదర్శిస్తున్న ఎయర్‌బస్ ఇండియా సిఇఓ శ్రీనివాసన్ ద్వారకానాథ్, ఆ సంస్థ ఆసియా మార్కెటింగ్ విభాగ అధిపతి జూస్ట్ వాన్ డెర్ హెజిదెన్