అవీ .. ఇవీ..

ఎడారిలో ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతికత, కళాత్మకత కలగలసిన అందమైన రూపాలు అక్కడ దర్శనమిస్తాయి. అమెరికాలోని నెవెడ ఎడారి ప్రాంతంలో ప్రతి ఆగస్టు చివరి సోమవారం, సెప్టెంబర్ మొదటి సోమవారం మధ్య జరిగే జాతరలో ఈ అపురూపమైన కళాకృతులు కనువిందు చేస్తాయి. ఏటా నెవెడాలో జరిగే ‘బర్నింగ్‌మ్యాన్’ వేడుకకు ఈసారి 70వేలమంది హాజరయ్యారు. ఇటలీలో ఎప్పుడో మూడు శతాబ్దాల క్రితం సామాజిక, సాంకేతిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు కారణమైన అంశాలను ప్రతిబింబించేలా ఈసారి కళాకృతులు రూపొందించారు. అలనాటి సంస్కృతీ వైభవాన్ని చాటేలా కళాకారులు తమ ప్రతిభను చాటారు. అలాంటివాటిలో ఎక్కువమందిని ఆకర్షించిన ఈ బ్లూవేల్ ఒకటి. అలాగే, ఓ ఎతె్తైన పీఠంపై ఓ జంట కబుర్లు చెప్పుకునే దృశ్యం ఆహూతులను కనువిందు చేసింది. ఇలాంటి వినూత్నమైన కళాకృతులు వందల సంఖ్యలో అక్కడ కన్పించాయి. అన్నట్లు వేడుక ముగింపు సందర్భంగా ఓ మనిషి గడ్డిబొమ్మను దగ్ధం చేయడం కొసమెరుపు. ఈ వేడుకను కొందరు సామాజిక అవసరం అంటే మరికొందరు పనికిమాలిన వేడుకంటారు. మరికొందరు రేవ్ పార్టీ తరహాలో జరిగే పండుగ అంటారు. ఏమైనా 1980నుంచి ఈ సంప్రదాయం మొదలైంది. ఏటేటా దీనికి హాజరయ్యే పౌరుల సంఖ్య పెరిగిపోతోంది.

భారతి