AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వామిత్రుడు మహోదయుని, వశిష్ఠ కుమారులని శపించాక ఋషులని త్రిశంకుడికి పరిచయం చేసి చెప్పాడు.
‘ఇక్ష్వాకు వంశీయుడైన ఇతను శరీరంతో స్వర్గానికి వెళ్లడానికి చేసే యజ్ఞానికి మీరంతా సహాయం చేయండి’
విశ్వామిత్రుడికి కోపం వస్తే శపిస్తాడనే భయంతో ఆయన చేసే క్రతువులో అంతా యాజకులుగా పని చేశారు. వారు క్రతువు నిర్వహణలో మంత్రపూర్వకమైన సహాయం చేశారు. ఆ యజ్ఞం అలా కొన్ని రోజులు జరిగాక విశ్వామిత్రుడు సమస్త దేవతలని వారి భాగాలు తీసుకోడానికి ఆహ్వానించాడు. వారు రాకపోవడంతో విశ్వామిత్రుడు కోపంతో ‘శ్రువం’ అనే హోమ పరికరాన్ని ఎత్తగానే దేవతలంతా వచ్చారు. విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకుడ్ని శరీరంతో స్వర్గానికి పంపాడు.
అతను స్వర్గంలోకి వచ్చాక, ఇంద్రుడు త్రిశంకుడ్ని భూమి మీదకి వెళ్లి పడమని శపించాడు. కాపాడమని అరుస్తూ త్రిశంకుడు మళ్లీ భూమి మీదకి వచ్చి పడ్డాడు. విశ్వామిత్రుడు ‘ఆగు’ అని అరిచి కోపంగా ఉత్తర దిక్కులో మరో సప్త ఋషులని, నక్షత్రమాలని, నక్షత్ర వంశాన్ని, మరో ఇంద్రుడ్ని, దేవతా సృష్టిని చేయడం ఆరంభించాడు. దాంతో ఋషులు, దేవతలు, అసురులు భయంతో విశ్వామిత్రుడి దగ్గరకి వెళ్లి అతన్ని శాంతింపజేస్తూ చెప్పారు.
‘ఓ తపోధనా! గురు శాపంతో ఛండాలుడైన త్రిశంకుడు శరీరంతో స్వర్గానికి వెళ్లడానికి అర్హుడు కాడు’
‘కావచ్చు. కాని ఇతన్ని శరీరంతో స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. అది అబద్ధం కావడం నాకు ఇష్టం లేదు. దాంతో ఇతను స్వర్గానికి వెళ్లాలి. కాబట్టి నేను సృష్టించిన నక్షత్రాలు ఈ లోకం ఉన్నంత కాలం స్థిరంగా ఉండేలా మీరు అనుమతించండి’ విశ్వామిత్రుడు కోరాడు.
‘సరే. కాని నువ్వు సృష్టించిన నక్షత్రాలన్నీ జ్యోతిశ్చక్రానికి బయట ఉండాలి. త్రిశంకువు ఆ నక్షత్రాల మధ్య తలకిందులుగా నివసించాలి’ దేవతలు కోరారు.
దానికి విశ్వామిత్రుడు అంగీకరించాడు. యజ్ఞం పూర్తయ్యాక దేవతలు, మునులు వెళ్లిపోయారు.
విశ్వామిత్రుడు దక్షిణ దిశలో చేసిన తపస్సుకి విఘ్నం కలగడంతో తూర్పు దిశకి వెళ్లి ఋషులతో కలిసి పుష్కర క్షేత్రంలో, పళ్లని, కందమూలాలని మాత్రమే తింటూ తిరిగి తపస్సుని ఆరంభించాడు.
ఆ కాలంలో మిథిలాధిపతి అంబరీషుడు ఓ యాగాన్ని ఆరంభించాడు. ఇంద్రుడు అతని యాగ పశువుని దొంగిలించాడు.
‘రాజా! మీ అధర్మం వల్లే యాగ పశువు పోయింది. మీరు పశువుని కాపాడలేకపోతే రాజుకి ప్రాణహాని. దీనికి చాలా పెద్ద ప్రాయశ్చిత్తం చేయాలి. పశువు దొరక్కపోతే మనిషినైనా ఆ స్థానానికి తెస్తే యజ్ఞాన్ని కొనసాగించవచ్చు’ రాజ పురోహితుడు రాజుకి చెప్పాడు.
దాంతో అంబరీషుడు వేలకొద్దీ ఆవులని ఇచ్చి నర పశువుని సంపాదించే ప్రయత్నంతో వివిధ దేశాల్లో, పల్లెల్లో, నగరాల్లో, ఆశ్రమాల్లో వెతుకుతూ భృగుతుంగ పర్వతం మీద ఉన్న రుచీక మహర్షి దగ్గరికి వెళ్లి నమస్కరించి ఇలా కోరాడు.
‘అన్ని దేశాలు తిరిగినా యజ్ఞ పశువు నాకు లభించలేదు. లక్ష ఆవులని తీసుకుని నీ కొడుకుల్లోని ఒకడ్ని నాకు యజ్ఞ పశువుగా ఇవ్వు’
‘నా పెద్ద కొడుకుని ఇవ్వను’ రుచీకుడు చెప్పాడు.
రుచీకుడి భార్య వెంటనే చెప్పింది.
‘సాధారణంగా తండ్రికి పెద్ద కొడుకంటే ఇష్టం. తల్లికి చిన్న కొడుకు ఇష్టం. కాబట్టి నా చిన్న కొడుకు శునశే్శపుడిని ఇవ్వను’
ఈ మాటలు విన్న మధ్య కొడుకు శునకుడు అంబరీషుడితో చెప్పాడు.
‘పెద్దకొడుకుని మా నాన్న, చిన్న కొడుకుని మా అమ్మ ఇవ్వనన్నారు. కాబట్టి మధ్యవాడైన నన్ను వాళ్లు నీకు ఇవ్వదలుచుకున్నారని నాకు అనిపిస్తోంది. అందువల్ల నన్ను తీసుకెళ్లు’
లక్ష ఆవులని ఇచ్చి అంబరీషుడు శునకుడ్ని తన వెంట తీసుకువెళ్లాడు (బాలకాండ సర్గలు 60-61)
ఆశే్లష హరికథ విని బయటకి వస్తూండగా ఆయన చెప్పిన కథలో ఏడు తప్పులు ఉన్నాయి అని కొందరు అనుకుంటూ వెళ్లడం విన్నాడు. అది నిజం కూడా.
మీరు ఆ ఏడు తప్పులని కనుక్కోగలిగారా?

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.విశ్వామిత్రుడు తపస్సు కోసం ఉత్తర దిక్కుకి వెళ్లడం తప్పు. ఆయన దక్షిణ దిక్కుకి వెళ్లాడు.
2.విశ్వామిత్రుడికి హవిష్యందుడు, మధుసంద్యుడు, ధృఢనేత్రుడు, మహారధుడు అనే నలుగురు కొడుకులు పుట్టారు. వాల్మీకి చెప్పిన ఈ పేర్లని హరిదాసు చెప్పలేదు.
3.విశ్వామిత్రుడు ఎంత కాలం తపస్సు చేశాడో వాల్మీకి చెప్పాడు. అది కొంతకాలం అనడం తప్పు. వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు.
4.విశ్వామిత్రుడు తపస్సు చేశాక ప్రత్యక్షమైంది శివుడు కాదు. బ్రహ్మ.
5.విశ్వామిత్రుడి కొడుకులు ధార్మికులు, బుద్ధిమంతులు అని వాల్మీకి వర్ణించాడు. హరిదాసు అది చెప్పలేదు.
6.దక్షిణ దిక్కులోని వశిష్ఠుడి కొడుకుల సంఖ్యని వాల్మీకి చెప్పాడు. వారు వంద మంది. హరిదాసు దీన్ని చెప్పలేదు.
7.హరిదాసు మహోదతుడు అనే తప్పు పేరు చెప్పాడు. అది మహోదయుడు.

మీకో ప్రశ్న

పరశురాముడు తపస్సు చేసిన
స్థలం ఎక్కడ ఉంది?

గత వారం ప్రశ్నకి జవాబు

77 కాండలు ఉన్నాయి.

మల్లాది వెంకట కృష్ణమూర్తి