జాతీయ వార్తలు

ఉత్తమ చిత్రంగా ‘ఎంబ్రాస్ ఆఫ్ ది సెర్పెంట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగాలీ సినిమాకు ‘ఐసిఎఫ్‌టి-యునెస్కో’ అవార్డు

గోవా, నవంబర్ 30: గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్-2015లో ఉత్తమ చిత్రంగా ‘ఎంబ్రాస్ ఆఫ్ ది సెర్పెంట్’ ఎంపికై, ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. కాగా ఉత్తమ దర్శకుడిగా ‘ఇసెన్‌స్టిన్ గాంజువాటో’ చిత్రానికి గాను పీటర్ గ్రీన్‌వే ఎంపికకాగా, ఆయనకు సిల్వర్‌పీకాక్ ట్రోఫీ బహూకరించారు. పదిరోజులపాటు అట్టహాసంగా జరిగిన ఈ చిత్రోత్సవం సోమవారంతో ముగిసింది. అవార్డుల ప్రదానోత్సవం తరువాత ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్‌మాన్ సారథ్యంలో సాగిన సంగీత కార్యక్రమం ఆహూతులను అలరించింది. దేశవిదేశాలకు వందలాదిమంది చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. 90 దేశాలనుంచి 289 చిత్రాలను ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించారు.
అవార్డుల వివరాలు
‘ది మెసర్ ఆఫ్ ఎ మ్యాన్’ చిత్రంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన నటుడు వినె్సంట్ లిండన్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. కాగా ఉత్తమ నటి కేటగిరీలో ఏకంగా ఐదుగురికి అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. డిజి ఎర్గువిన్ దర్శకత్వంలో రూపొందిన ‘ముస్తాంగ్’ సినిమాలో ఒకరికొకరు తీసిపోని విధంగా నటించిన ఐదుగురు నటీమణులు ఎరిట్ అస్కాన్, ఇబ్బా సుంగరొగ్గు, దొగ దొగుషు, గనెస్ నిజి సెన్యాస్ ఇలద్ అక్టోగన్‌లకు ఉత్తమ నటీమణులుగా పురస్కారం ప్రదానం చేశారు. లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్-2015 అవార్డు ఆస్కార్ అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు నికిత మిఖల్‌కోవ్‌ను వరించింది. ‘నలభై ఏళ్ల క్రితం నా తొలి సినిమాతో, తొలి భారతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న నేను, ఇప్పుడు మరోసారి భారత్‌లో జరుగుతున్న ఫిల్మోత్సవ్‌లో ఈ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’ అని మిఖల్‌కోవ్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక స్పెషల్ జ్యూరి అవార్డును స్పానిష్ ఫిల్మ్ ‘సీల్డ్ కార్గొ’లో అద్భుత ప్రతిభ కనబరిచిన మిస్ జులియస్‌వర్గస్‌కు దక్కింది. ఇక ఈ ‘ఇఫి’ చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఐసిఎఫ్‌టి-యునెస్కొ ఫెల్లిని అవార్డును బెంగాలీ సినిమా ‘సినిమావాలా’ గెలుచుకుంది. నిజానికి ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సినిమాలో అసమాన ప్రతిభ చూపిన కౌశిక్ గంగూలీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. యునెస్కో లక్ష్యాలను ప్రతిబింబించే ఇతివృత్తాలతో తీసే చిత్రాలకు ఈ అవార్డును ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ ఆడియో విజవల్ కమ్యూనికేషన్ (ఐసిఎఫ్‌టి)తో కలసి ఈ అవార్డును ఇస్తున్నారు. ఇక స్పెషల్ మెన్షన్ అవార్డును సెర్బియన్ ఫిల్మ్ ‘ఎన్‌క్లేవ్’ గెలుచుకుంది. ఈ వేడుకకు బాలీవుడ్‌తో సహా పలు భాషల నటీనటులు పెద్దఎత్తున హాజరయ్యారు.