రాష్ట్రీయం

బాక్సైట్ తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి అయ్యన్నపాత్రుడు
సింహాచలం, నవంబర్ 21: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సింహాచలంలో శనివారం స్వామివారి దర్శనానికి వచ్చిన ఆయన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలను ప్రతిపక్షాలతో పాటు అనేక ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ విషయమై ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ గిరిజనుల మనోభావాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలన్నారు. గనుల తవ్వకాలపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో లేని అభ్యంతరాలు మన రాష్ట్రంలోనే ఎందుకొస్తున్నాయో అన్న అంశంపై కూడా ఆలోచించాలని ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాక్సైట్ తవ్వకాల వల్ల లాభనష్టాలపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని అయ్యన్న అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఉద్దేశ్యం కూడా అదేనని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు కావాలనే బాక్సైట్ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలపై వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుమతులు వచ్చాయని, అప్పుడు మంత్రిగా ఉన్న బాలరాజుకు గుర్తుకురాని గిరిజనులు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చారని అయ్యన్న అన్నారు. సింహాచలం దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతుండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాఉంటే మంత్రి అయ్యన్న సతీసమేతంగా సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు. అర్చకులు మంత్రి పేరున అష్టోత్తర శతనామార్చన పూజలు చేశారు.