రాష్ట్రీయం

కఠిన నియమాలతో అయ్యప్ప అనుగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 28: కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షను చేపట్టిన భక్తులు కఠిన నియమాలు పాటించడం వల్ల అయ్యప్ప అనుగ్రహానికి పాత్రులు కాగలరని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. శనివారం విశాఖ మురళీనగరలో నిర్వహించిన ధర్మశాస్త్రానంద వారోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్ఛేసారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహభాషణ చేస్తూ అయ్యప్పస్వామిని కలియుగ దైవంగా ఆరాధించడం వల్ల మనోనిగ్రహం, ఆత్మస్థయిర్యం అలవడతాయన్నారు. దాంతోపాటు ధర్మాన్ని అనుసరించగలరన్నారు. అయ్యప్పస్వామికి విశేషాభిషేకాలు, హోమాలు, భజనలు చేసి శబరిమలను తలపించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ధర్మశాస్త్రానంద వారోత్సవానికి కేరళ నంచి వచ్చిన వాయిద్య బృందాలు, ఏనుగులు, గుర్రాలతో శోభాయాత్ర నిర్వహించారు. కుల, మతాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని స్వామి అన్నారు. ఆయన పర్యవేక్షణలో ఈ వేడుకలను నిర్వహించారు. (చిత్రం) అయ్యప్పస్వామికి పూజలు నిర్వహిస్తున్న స్వరూపానందేంద్ర