సబ్ ఫీచర్

ఇస్తేనే వచ్చేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా భ్రాంతి యేనా అని ఏదో పాట ఉందికదా. నిజమే. అంతా భ్రాంతినే. మనమనడమే భ్రాంతి. మనమెవరము. శ్రీరమణులు నేను అంటే ఎవరో కనుగొను అసలు నిజం తెలస్తుంది అన్నారు. నేను అనేదేమిటో కనుగొనాలంటే మనకొక గురువు కావాలి. గురువులేనిదే ఆత్మ విద్య అలవడదు అని వేదం - గురోర్దర్శనం ముక్తిః అన్యథా ముక్తిర్నాస్తి అంది. అక్కడ నుంచి మొదలుపెడితే జాతి మత కుల వర్ణ విభాగాలన్నీ కూడా ఒక్కటే చెబుతున్నాయి. గురువు కృపా మహిమ కలవారు. ఆయన చేసే మహోపకారం అపారం. అనంతుని దర్శించగల అనంత వీక్షణ ను గురువు అనుగ్రహిస్తాడు అని కబీరు చెప్పారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అనింది మన హైందవం.
ప్రకృతి అంతా నీకు గురువే. దేన్ని నీవు అనుకరిస్తే అది నీకు గురువై పాఠం బోధిస్తూనే ఉంది. కనుక నీవు శిష్యునిగా మారు అన్నాడు దత్తాత్రేయుడు. ఆయనే ఇరవై నాలుగు మంది గురువుల వల్ల నేను జ్ఞానామృతాన్ని గ్రోలాను అన్నారు.
ఈ ప్రకృతి లోని ప్రతి పదార్థమూ పరోపకారం చేయమని ప్రబోధిస్తోంది. నదులు తాగడానికి నీటిని ఇస్తున్నాయి. చెట్లు ఆహారానే్న కాదు బతకడానికి కావలసిన ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఇలా ప్రతిదీ మానవఅభ్యుదయానికి కారకాలు అవుతున్నాయి.
మరి మనిషి బుద్ధిజీవి. ఇవి పరోపకారం చేస్తున్నాయని కనుగొన్నాడు. అదే మనిషి నేడు స్వార్థపూరితుడై పక్కవాని సొమ్మును లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి కారణం కేవలం మోహం. మోహమనే అజ్ఞానం. ఈ అజ్ఞాన పొర తొలగించుకొంటే జ్ఞానమనే వెలుగుతో పరోపకారం చేయడానికి వీలు అవుతుంది. మొట్టమొదట ఇవ్వడంలోని ఆనందాన్ని రుచి చూడగలిగితే అంతా పరబ్రహ్మమే కనిపిస్తుంది.

- చోడిశెట్టి శ్రీనివాసరావు