బిజినెస్

అవినీతిపరుల అంతుచూస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 23: అవినీతి మకిలి అంటిన ఎవరినీ ఎన్‌డీఏ ప్రభుత్వం ఎన్నడూ రక్షించలేదని, రక్షించబోదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో అక్రమాలకు పాల్పడిన వారిని చట్టానికి అప్పగిస్తామని, ఈ విషయంలో ఏ చిన్న విషయాన్ని వదలిపెట్టబోమని ఆయన తేల్చి చెప్పారు. నగర శివారు బాంద్రాలో జరిగిన నిర్వహించిన ‘్ఛపల్’ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ పీఎన్‌బీలో చోటుచేసుకున్న రూ.11,400 కోట్ల కుంభకోణంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వ్యవహారంలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఏ చిన్ని అవకాశాన్ని వదిలిపెట్టేది లేదని, దేశం తలెత్తుకునేలా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఇంత భారీ కుంభకోణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు వౌనం పాటిస్తున్నారన్న ప్రశ్నకు గడ్కరీ కాస్త గట్టిగా సమాధానమిచ్చారు. ‘ఈ వ్యవహారంలో మోదీ ఏదో ఒకటి చెప్పాలని కోరుతున్నవారు, అలా అడగటానికి ముందు అసలు ఈ కుంభకోణానికి ఎవరు కారకులో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు.
మహారాష్ట్ర రాజకీయాలకు దూరం
కేంద్రమంత్రివర్గంలో రోడ్డురవాణా, రహదారులు, గంగానది ప్రక్షాళన, నౌక, జలవనరులు, నదుల అభివృద్ధి వంటి శాఖలు నిర్వహిస్తున్న నితిన్ గడ్కరీ సొంత రాష్టమ్రైన మహారాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకు అలాంటి అవకాశమే లేదని చెప్పారు. మొదట జాతీయస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలనుకోలేదని, కానీ కొత్త బాధ్యతలకు అలవాటుపడ్డానని, మళ్లీ మహారాష్టక్రు రావాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్థానంలో గడ్కరీని నియమిస్తారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
ఢిల్లీలో అటు వాయుకాలుష్యం, ఇటు రాజకీయ కాలుష్యం పొటమరించి ఉన్నాయని, అయినా ఆ పరిస్థితుల్లో నెట్టుకురాగలుగుతున్నానని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారత్‌లో డ్రైవింగ్ లైసెన్సులను సులువుగా పొందవచ్చునని, అందువల్ల నకిలీ డాక్యుమెంట్లతో డ్రైవింగ్ లైసెన్సులు పొందుతున్నారని, మనదేశంలో 30 శాతం లైసెన్సులు బోగస్‌వేనని చెప్పిన గడ్కరీ దేశంలో ఏటా 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ డ్రైవింగ్ లైసెన్సుల ఏరివేత కోసం ఏకీకృత ఈ-గవర్నెన్స్ కార్యక్రమం అమలు చేయనున్నామని, దేశంలో కొత్తగా 2వేల మోటార్ ట్రైనింగ్ కేంద్రాలను ప్రారంభించనున్నామని చెప్పారు.