బిజినెస్

నేడే రాష్ట్ర బడ్జెట్ గోప్యంగా వివరాలు రూ. 2 లక్షల కోట్ల అంచనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 7: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు. కేంద్రం నుంచి పెద్దగా ఆశించిన మేర నిధుల కేటాయింపులు లేకపోయినప్పటికీ, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో పన్నుల వడ్డింపు ఉండకపోయినప్పటికీ, గతంలో ఎన్నడూ లేని విధంగా గోప్యతను ఆర్థిక శాఖ అధికారులు పాటిస్తున్నారు. బడ్జెట్ వివరాలు బయటకు పొక్కకుండా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.56 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందించారు. ఈ సారి వివిధ శాఖల నుంచి అదనపు కేటాయింపులు ఎక్కువ అవుతుండటంతో ఆ మేరకు బడ్జెట్‌ను రెండు లక్షల కోట్ల రూపాయలతో రూపొందించనున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా కొత్త బడ్జెట్‌లో 25 వేల కోట్ల రూపాయులు కేటాయించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు 13 వేల రూపాయలు కేటాయించేందుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. గత బడ్జెట్‌లో ప్రకటించి ఇంకా అమలుకు నోచుకోని నిరుద్యోగ భృతికి అదనంగా మరిన్ని నిధులు కేటాయించనున్నారు. యువత, మహిళలను ఆకట్టుకునే విధంగా బడ్జెట్ రూపొందిస్తున్నారు. జనాకర్షక పథకాలు ప్రతిపాదించే వీలు ఉంది. అసెంబ్లీలో ఉదయం 11 గంటలకు యనమల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనిని లాంఛనంగా గురువారం ఉదయం 7.30 గంటలకు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదముద్ర లాంఛనంగా వేస్తారు. బడ్జెట్ వివరాలు లీక్ కాకుండా, అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముగ్గురు అధికారులకు మినహా, మిగిలిన వారికి ఎవరికీ ఈ వివరాలు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే బ్యాగ్‌లను కూడా నమ్మకస్తులైన సిబ్బందితో సిద్ధం చేయిస్తున్నారు.