భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పందిళ్ల భావనాచారి, గోదావరి ఖని
ప్ర: హిందూమతంలో అనైక్యతకు కులతత్వం కారణం కాదా? ఆ భేదాలే అనైక్యతకు దారితీస్తున్నాయి కదా?
సమా: కాదు, అది పొరపాటు భావన. భేదాలు ప్రకృతి సహజం. గుణ, కర్మ, విభాగశః అని వ్యక్తి గుణాన్ని బట్టి, చేసే వృత్తులను బట్టి సహజానికి ‘డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్’ సిద్ధాంతంగా భేదాలు తప్పనిసరి. భేదాలు వేరు, భేదనీతి వేరు. స్వార్థపరులు, వ్యక్తిగత మహత్వాకాంక్షాపరులు తమ కార్యసాధన కోసం భేదనీతిని ప్రకోపింపజేసి ద్వేషాలు రగులుస్తారు. ఇక మన హిందూ మేధావుల్లో జ్ఞానం యొక్క అతివ్యాప్తి దోషం అనేది మనకు కీడును కలిగిస్తున్నది. ఇటువంటి వారి గురించి ఉర్దూలో ఒక సామెత ఉంది. ‘హద్ సే జ్యాదాచాలక్ మీగర్ బేకార్’ అని. అందుకే ‘్ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధిం శరణం గచ్ఛామి’ అన్న బుద్ధ భగవానుని బోధనలతో విద్యుక్త ధర్మాన్ని, సమాజ శ్రేయస్సును మననం చేసుకుంటూ, ఆవేశానికి బదులు ఆలోచనతో బుద్ధికి పదునుపెడితే సమస్యలు ఉండవు.
బి.నాగభూషణం, రాళ్లకుంట (ప.గో.)
ప్ర: నాకు కారుయోగం ఎప్పుడు?
సమా: ప్రత్యేకంగా కారుయోగమంటూ జ్యోతిష్యంలో ఎక్కడా ఉండదు. ‘వాహన యోగం’ అని మాత్రమే వుంటుంది. అది స్వంత వాహనమే కానక్కరలేదు. ప్రభుత్వ వాహన యోగమైనా అయి ఉండవచ్చు. అయితే ఈ దిశగా ‘దుర్ముఖి’ నామ సంవత్సరంలో అవకాశాలు కనబడుతున్నాయి.
బి.ఆర్.మూర్తి, కీరపండరీపురం (బందరు)
ప్ర: నాకు జీర్ణశక్తికి సంబంధించిన అనారోగ్యం వుంది. బాగుపడాలంటే ఏం చేయాలి?
సమా: ‘తచ్ఛాంతి రౌషధైర్దానైః జపహోమ సురార్చనైః’ అని పెద్దలు చెప్పారు. ఔషధ సేవతో పాటు ఏకాదశి ఉపవాస నియమాన్ని పెట్టుకోండి. నిష్ఠగా పాటించండి. ఆరోగ్యం బాగవుతుంది.
పి.వెంకట రాజమల్లయ్య,
బీబీపేట (నిజామాబాద్)
ప్ర: నా ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటాయి?
సమా: ఆరోగ్యానికి సంబంధించినంతవరకు వయోభారం కారణంగా నరాల బలహీనత సూచించబడుతోంది. ముఖ్యంగా పొత్తికడుపుకింది భాగంలో సమస్య కనిపిస్తోంది. మీ ఆర్థిక పరిస్థితికి మీరు చేసిన పొరపాట్లే కారణం.
కె.పవన్‌కళ్యాణ్, హైదరాబాద్
ప్ర: నా చదువు పూర్తి కాలేదు. ఏమీ చేయలేకపోతున్నాను. మార్గం చెప్పండి.
సమా: ప్రతిరోజూ ‘హనుమాన్ చాలీసా’ పారాయణం చేయండి. ఆంజనేయస్వామిని గుళ్ళో దర్శించండి. బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం ఆంజనేయస్వామి వల్ల కలుగుతాయి. అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకి కూడా హనుమంతుడి బొమ్మ ప్రేరణ అని వార్తల్లో వచ్చింది కదా.
పిన్నంరాజు అలేఖ్య, తిమ్మాపురం (తూ.గో)
ప్ర: వివాహం ఎప్పుడు? ఏ దిశగా సంబంధం వస్తుంది?
సమా: ఈ ఏడాది చివరిలో అవకాశం ఉంది. తూర్పు దిశ. మ, ప, స అక్షరాలు.
కె.ఎన్.వి.ఎస్.శివకుమార్, తణుకు
ప్ర: నా సి.ఏ ఎప్పుడు పూర్తవుతుంది.
సమా: 2017లో అందుకు అవకాశం ఉంది. భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంది.
ఎన్.సి. పెరుమాళ్ళాచార్యులు,
తిరుచానూర్ (తిరుపతి)
ప్ర: ప్రపంచంలో హింసాత్మక మతోన్మాదుల ఘాతుకాలు గతంలోను, వర్తమానంలోను ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. అయినా, మేధావులు అనబడేవారు హిందూ మతోన్మాదమంటారేమిటి?
సమా: హైందవేతరులంటే వారికి భయమూ, ఓటు బ్యాంకు రాజకీయమూ కారణాలు. హిందువులు కూడా ఓటు బ్యాంకును ఏర్పరచుకుంటే పరిస్థితిలో మార్పు వస్తుంది.
ఉయ్యాల భగీరథ శర్మ, ద్రోణాచలం
ప్ర: ప్రతి వ్రతానికి, దీక్షకు మండలము అని చెపుతారు. మండలానికున్న ప్రాధాన్యమేమిటి?
సమా: మండలం అంటే నలభై, నాలుగు పదులు అని అర్థం. నాలుగు సంఖ్యకు అధిపతి విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వర సంఖ్యవలన ఎలాంటి విఘ్నం కలగదు.
ఎం.రవికుమార్, గోషామహల్ (హైదరాబాద్)
ప్ర: నాకు ప్రభుత్వోద్యోగ యోగం ఉందా?
సమా: ప్రభుత్వ సంబంధం గల సంస్థలో మీకు ఉద్యోగ యోగం వుంది. *

పేరు :
చిరునామా : ...................................................... ......................................................
.....................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
..............................................................
ప్రశ్న : .............................................................
........................................................
సంతకం :

కూపన్ల ద్వారా మాత్రమే ప్రశ్నలు పంపాలి.
పోస్ట్‌కార్డ్‌లపై, కవర్ల ద్వారా పంపిన
ప్రశ్నలు పరిశీలించబడవు.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ