జాతీయ వార్తలు

భత్కల్‌పై మరోసారి ఎన్‌ఐఎ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు/న్యూఢిల్లీ, జనవరి 23: కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సోదాలు జరుపుతూ ఉగ్రవాద అనుమానితులను అరెస్టు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఉత్తర కన్నడ తీరప్రాంత పట్టణమైన భత్కల్‌పై మరోసారి దృష్టి కేంద్రీకరించింది. యువతలో ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందిస్తూ, పెద్దసంఖ్యలో నియామకాలు జరపడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న షఫీ అర్మర్‌ను శుక్రవారం అరెస్టుచేసి నిర్బంధంలోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఎ వర్గాలు తెలిపాయి. కరడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్ సుల్తాన్ అర్మర్‌కు షఫీ అర్మర్ స్వయానా సోదరుడు. వీరిద్దరూ భత్కల్ పట్టణానికి చెందినవారే. ఐఎస్‌ఐఎం, తెహ్రిక్-ఎ-తాలిబాన్ వంటి ఉగ్రమూకలతో ఏర్పాటైన అన్సర్ ఉల్ తౌహీద్ (ఎయుటి) గ్రూపునకు సారథ్యం వహిస్తున్న షఫీ అర్మర్ దేశ వ్యాప్తంగా అనేకమంది యువతతో సంబంధాలను కలిగి ఉన్నాడని అధికార వర్గాలు వెల్లడించాయి. తాజాగా బెంగళూరు, ముంబయి, లక్నో, హైదరాబాద్, తుమకూరు, మంగళూరులో అరెస్టు చేసిన దాదాపు 14 మంది యువకులతోనూ షఫీ అర్మర్‌కు సంబంధాలు ఉన్నాయని, భారీ విధ్వంసాన్ని సృష్టించాల్సిందిగా అతను వారికి సూచిస్తున్నాడని ఎన్‌ఐఎ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆన్‌లైన్ ద్వారా యువతకు ఉగ్రవాద భావాజాలాన్ని నూరిపోసి పెద్ద సంఖ్యలో నియామకాలు జరుపుతున్న షఫీ అర్మర్‌కు ‘ట్విట్టర్’, ‘ఫేస్‌బుక్’ వంటి సామాజిక మాధ్యమాల్లో అనేక ఖాతాలు ఉన్నాయని, వీటి ద్వారానే అతను యువతకు వల విసురుతున్నాడని అధికార వర్గాలు వెల్లడించాయి.
షఫీ అర్మర్‌కు స్వయానా అన్న అయిన అబ్దుల్ సుల్తాన్ అర్మర్ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) నాయకుడు యాసిన్ భత్కల్‌కు సన్నిహిత అనుచరుడు. సుల్త్, ముల్లా, వౌలానా అనే పేర్లతో చిరపరిచితుడైన షఫీ ముగ్గురు సంతానంలో రెండోవాడు. వీరంతా భత్కల్‌లోని నవాయత్ కాలనీలో గల హజీ మంజిల్ పెరిగారు. గతంలో దర్యాప్తు అధికారులు యాసిన్ భత్కల్‌ను ఇంటరాగేట్ చేసినప్పుడు అర్మర్ పేరు వెలుగులోకి వచ్చింది. సుల్తాన్ అర్మర్ పాకిస్తాన్‌లోని ఉత్తర వజీరిస్తాన్‌లో తీవ్రవాద శిక్షణకు వెళ్లినట్లు అప్పట్లో యాసిన్ భత్కల్ వెల్లడించాడు. అయితే 2014లో యాసిన్ భత్కల్ అరెస్టు తర్వాత ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన కొంత మంది క్రియాశీలక సభ్యులు పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలను తెగతెంపులు చేసుకుని, అర్మర్, మరికొంతమంది ఐఎం అనుచరులు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థలో చేరారు. సుల్తాన్ అర్మర్‌ను అన్సర్ ఉల్ తౌహీద్‌కు నాయకుడిగా ప్రకటిస్తూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత అబూ బకర్ అల్ బాగ్ధాదీ ఇచ్చిన వీడియో సందేశమే ఇందుకు సంబంధించిన కీలక ఆధారం. సుల్తాన్‌ను బాగ్ధాదీ నాయకుడిగా ప్రకటిస్తున్న ఈ వీడియో 2014లో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది.