ఆంధ్రప్రదేశ్‌

బస్సు సమాచారంపై ఆర్టీసి కొత్త యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 23: రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఆర్టీసీ డిపో నుంచి బస్సు బయలుదేరిన క్షణం నుంచి ఎక్కడ ఉందో తెలుసుకునే విధంగా కొత్త యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎపిఎస్‌ఆర్టీసీ ఎం.డి నండూరి సాంబశివరావు తెలిపారు. శనివారం గుంటూరు ఎన్‌టిఆర్ బస్టేషన్‌ను తనిఖీ చేసిన ఎం.డి నండూరి విలేకరులతో మాట్లాడారు. ప్రైవేటు బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సురక్షిత ప్రయాణానికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లాలోని అమరావతి, తెనాలి బస్సు రూట్లలో పల్లెవెలుగు బస్సు బయలుదేరిన సమయం నుంచి రాబోయే బస్టేషన్‌కు వచ్చే సమయం ముందుగా తెలిసే విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నామన్నారు. ఈ విధానం విస్తరించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. గత ఏడాది ఆర్‌టిసి సంస్థ రూ.600 కోట్ల నష్టాల్లో ఉండగా, ఈ ఏడాది కేవలం రూ.500 కోట్లు మాత్రమే నష్టం వచ్చే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీకి రూ.100 కోట్లు నష్టాన్ని తగ్గించగలిగామని, అయితే సంస్థ నష్టాల్లో ఉన్నందున పాత బస్సులను తిప్పుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,500 పాత బస్సులు ఉన్నాయని, వాటి స్థానాన్ని భర్తి చేయటమే కాకుండా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 4,000 కొత్త బస్సులు త్వరలో రోడ్డు మీదకు వస్తాయన్నారు. గతంలో ఆర్‌టిసి ప్రాంగణాల్లో గల టాయిలెట్స్ ప్రైవేటు సంస్ధలకు అప్పగించటం వలన ఏడాదికి రూ 4 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటంలో విఫలమైయ్యారన్నారు. దీంతో ఆర్‌టిసి యాజమాన్యం పే అండ్ యూజ్ టాయిలెట్లు విజయవాడ, గుంటూరు బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుడు టాయిలెట్‌ను ఉపయోగించుకునే పక్షంలో 5 వసూలు చేస్తున్నట్లు తెలిపారు.