రాష్ట్ర వార్తలు

బాలిక కిడ్నాప్.. అత్యాచారం

  • 24/04/2013

శ్రీకాళహస్తి,ఏప్రిల్ 23: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం తళ్లపాళెం బిసి కాలనీలోని మైనర్ బాలికను అదే కాలనీకి చెందిన యువకుడు అమలేష్‌రాయ్(23) కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాళహస్తి రూరల్ ఇన్‌చార్జి సిఐ నాగరాజు మంగళవారం విలేఖరులకు వివరాలు తెలిపారు. బీహార్ రాష్ట్రం చప్రా జిల్లా చోటా బరంపురం గ్రామానికి చెందిన అమలేష్ రాయ్ అదే జిల్లా జలాలంపూర్ గ్రామానికి చెందిన మరొకరు ఇక్కడి ల్యాంకో కర్మాగారంలో పనిచేస్తున్నారు. తళ్లపాళెం బిసి కాలనీలో గత 10 ఏళ్లుగా పక్కపక్క ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 12వతేది నుండి అమలేష్‌రాయ్ పక్కింట్లో నివాసం ఉంటున్న బీహారీ కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలిక కనిపించడం లేదు. దీంతో బాధితుడు ఈ నెల 14న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమలేష్‌రాయ్ కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులతో సహా చోటా బరంపురానికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.బాలికలను కూడా అక్కడే గుర్తించారు. ఈ నెల 12న బీహారీ కుటుంబానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి చెన్నైకి వెళ్లి అక్కడ నుండి బీహార్‌కు వెళ్లినట్లు అమలేష్‌రాయ్ పోలీసుల ఎదుట అంగీకరించారు. అమలేష్‌రాయ్ తనపై పలు పర్యాయాలు అత్యాచారం చేసినట్లు బాలిక కూడా పోలీసులకు తెలిపింది. దీనిపై అమలేష్‌రాయ్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading