రాష్ట్రీయం

‘బాహుబలి’కి ఐఫా అవార్డుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25-ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో ‘బాహుబలి’ పంట పండింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఆధ్వర్యంలో తొలిసారిగా దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రతిభ చూపిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమానికి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా మారింది. ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలిరోజు తమిళ, మలయాళ సినీ పరిశ్రమలో గతేడాది విడుదలైన సినిమాల్లో ఉత్తమ ప్రతిభ చూపినవారికి అవార్డులను ప్రకటించారు. తమిళ చిత్రసీమకు సంబంధించి గతేడాది విడుదలైన బాహుబలి (తమిళం) సినిమా మొత్తం ఏడు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (రాజవౌళి), ఉత్తమ సహాయ నటుడు (సత్యరాజ్), ఉత్తమ సహాయ నటి (రమ్యకృష్ణ), ఉత్తమ నేపథ్య గాయని (గీతామాధురి), ఉత్తమ నేపథ్య గాయకుడు (హరిచరణ్ శేషాద్రి), ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ (సబు సిరిల్) అవార్డులను ‘బాహుబలి’ కైవసం చేసుకుంది. కాగా తమిళంలో గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన ‘తన్నిఒరువన్’కూడా పెద్దసంఖ్యలో అవార్డులను దక్కించుకుంది. ఈ చిత్రంలో నటించిన జయం రవి (ఉత్తమ నటుడు), ఉత్తమచిత్రం, అరవింద్ స్వామి (ఉత్తమ విలన్) అవార్డులను గెలుచుకున్నారు. కాగా ‘మాయ’ సినిమాలో ప్రతిభచూపిన నయనతార ఉత్తమ నటిగా అవార్డు కొట్టేశారు. ఉత్తమ కమెడియన్ (మహిళ)గా ‘కాంచన-2’లో నటించిన కోవై సరళ అవార్డు దక్కింది. ‘కత్తి’ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసిన యువకుడు అనిరుథ్ రవిచందర్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచాడు. ‘మారి’ సినిమాకు పనిచేసిన ధనుష్‌కు ఉత్తమ గేయరచయితగా అవార్డు దక్కింది.
మలయాళ విభాగం
మలయాళ చిత్రపరిశ్రమకు సంబంధించి ఉత్తమ చిత్రంగా ‘నేను ఎంటె మొయిదీన్’ నిలిచింది. ఈ చిత్రానికి మరో నాలుగు అవార్డులుకూడా వరించాయి. ఉత్తమ నటుడు (పృధ్వీరాజ్ సుకుమారన్), ఉత్తమ నటి పార్వతి మేనన్, ఉత్తమ సహాయ నటి-లీనాకుమారి, ఉత్తమ నేపథ్యగాయని-శ్రేయఘోషల్, ఉత్తమ దర్శకుడిగా లాల్‌జోస్ (నీన) ఎంపికయ్యారు. కాగా ‘ఒరువద్దకన్ సెల్ఫీ’ సినిమాలో నటించిన అజు వర్గీస్‌కు ఉత్తమసహాయ నటుడి అవార్డు దక్కింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా ‘ప్రేమమ్’కు పనిచేసిన రాజేశ్ మురుగేశన్‌ను అవార్డు వరించగా ఉత్తమ నేపథ్య గాయకుడిగా విజయ్ ఏసుదాస్, ఉత్తమ హాస్యనటుడిగా వినయ్ అవార్డులు సొంతం చేసుకున్నారు. కాగా అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా తమిళ సినీరంగానికి చెందిన దివంగత ప్రముఖులు కె.బాలచందర్, ఎం.ఎస్.విశ్వనాథన్‌లకు ఐఫా నివాళి అర్పించింది. కాగా తెలుగు, కన్నడ చిత్రసీమకు చెందినవారికికూడా అవార్డుల ప్రకటించనున్నారు.
ఐఫా దక్షిణాది సినీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ హీరో రామ్‌చరణ్ వేదికపై చేసిన డ్యాన్స్ అందరినీ అలరించింది. తెలుగు, కన్నడ సినీరంగానికి చెందిన తారలు, నిర్మాతలు, దర్శకులు గ్రీన్‌కార్పెట్‌పై క్యాట్‌వాక్ చేసి ఆహూతులను అలరించారు. అల్లుశిరీష్, రెజీనా వ్యాఖ్యానం అందరనీ ఉర్రూతలూగించింది.