బిజినెస్

భారీ వేతనాలతో ఘజియాబాద్ ఐఎంటి రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: భారతీయ ప్రీమియర్ బిజినెస్ స్కూల్‌గా ఘనత సాధించిన ఘజియాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటి) 535 మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్ కల్పించడం ద్వారా మరోసారి చరిత్ర సృష్టించింది.
ఫ్లాగ్‌షిప్, డిసిపి ప్రోగ్రామ్ విద్యార్థులు సహా 535 మంది విద్యార్థులకు సగటున రూ. 10.8 లక్షలు, గరిష్ఠంగా రూ. 21.17 లక్షల వేతనపు ప్లేస్‌మెంట్‌తో ఐఎంటి రికార్డు సృష్టించిందని ఆ సంస్థ కార్పొరేట్ రిలేషన్స్ హెడ్ విశాల్ గోయల్ తెలిపారు.
ప్లేస్‌మెంట్ సాధించిన విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య కొత్త ప్రపంచంలో అడుగుపెడుతున్నారని ఆయన ఒక ప్రకటనలో సోమవారం వెల్లడించారు. ఐఎంటిలో అంతర్జాతీయ స్థాయి బోధన, సంబంధిత పరిశ్రమ అనుభవం భవిష్యత్ బిజినెస్ లీడర్స్‌ను సృష్టించిందని ఆయన పేర్కొన్నారు.