బిజినెస్

భయపడనక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: స్టాక్, కరెన్సీ మార్కెట్లు క్రమేణా డీలా పడుతున్న నేపథ్యంలో ఆందోళన అక్కర్లేదంటూ మదుపరులకు ధైర్యం చెప్పారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం ఉంచండి అంటూ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని అన్నారు. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రమాదకరంగా పరిణమించిన మొండి బకాయిల విషయంలో బ్యాంకర్లకు ప్రభుత్వం త్వరలో స్వేచ్ఛనివ్వనుందని కూడా చెప్పారు. బ్యాంకుల లాభాలను నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) ప్రభావితం చేస్తున్నాయన్న ఆయన వాటిని తిరిగి వసూలు చేయడంలో బ్యాంకులకు పూర్తి అధికారమిస్తామన్నారు.
గురువారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 807 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 239 పాయింట్లు నష్టపోయినది తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐతోపాటు మరికొన్ని బ్యాంకులు, ఇతర సంస్థల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించి లేకపోవడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కూడా 29 నెలల కనిష్ట స్థాయిని తాకింది. 45 పైసలు క్షీణించి 68.30 వద్ద స్థిరపడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇక్కడ అరుణ్ జైట్లీ విలేఖరులతో మదుపరులనుద్దేశించి మాట్లాడారు. అంతర్జాతీయ మందగమనం మధ్య కూడా ప్రభుత్వ చర్యలతో దేశ వృద్ధిరేటు పురోగతి చెందుతోందన్న ఆయన మరింతగా వృద్ధిపథంలో వెళ్లేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. గురువారం మార్కెట్ నష్టాల్లో ప్రధాన పాత్ర పోషించిన ఆర్థిక ఫలితాలు.. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు గణనీయంగా పడిపోవడంపై జైట్లీ మాట్లాడుతూ మొండి బకాయిల సమస్య పరిష్కారానికి త్వరలో ప్రభావవంతమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో గత ఏడాది మార్చి నాటికి 2.67 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మొండి బకాయిలు.. సెప్టెంబర్‌కల్లా 3.01 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి.
కాగా, శుక్రవారం స్టాక్ మార్కెట్లతోపాటు, రూపాయి మారకం విలువ స్వల్పంగా కోలుకున్నాయి. ఇక ఈ నెల 29న వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016- 17)గాను పార్లమెంట్‌లో జైట్లీ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా, దీనిపైనా మదుపరులు దృష్టి సారించడంతో, ప్రస్తుతం దెబ్బతిన్న సెంటిమెంట్‌ను మళ్లీ పుంజుకునేలా చేయడానికి బడ్జెట్‌ను ఆకర్షణీయంగా జైట్లీ తీర్చిదిద్దనున్నారనే అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులకు బాసెల్-3 నిబంధనల ప్రకారం పెద్ద ఎత్తున నిధులను కూడా సమకూర్చుతున్నామని జైట్లీ ఈ సందర్భంగా పేర్కొనగా, మిగతా నిధుల సమీకరణకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఏమాత్రం అనుకూలం కావని బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు. ఏదిఏమైనా మదుపరులు భయపడనక్కర్లేదంటూ పరిస్థితులు చక్కబడతాయన్న ఆశాభావాన్ని జైట్లీ కనబరిచారు.