మంచి మాట

భాషణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్భషణం’ అనేది మానవునికి భూషణం. భాషణం అంటే మాట్లాడటం, భూషణం అంటే అలంకరణ. మనం మాట్లాడే ప్రతి మాటా మధురంగా వుండాలి. ఇతరుల మనస్సును నొప్పించే విధంగా వుండరాదు. ‘కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంగా మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకంగా నిలుస్తారు’ అని స్వామీ వివేకానంద చెప్పారు. అందుకే గౌతమబుద్ధుడు అష్టాంగ మార్గాలలో సరైన వాక్కుని కలిగి ఉండాలని చెప్పడం జరిగింది.
అష్టాంగ మార్గాలు- 1.సరైన దృష్టి 2.సరైన క్రియ 3.సరైన వాక్కు 4.సరైన లక్ష్యం 5.సరైన ప్రయత్నం 6.సరైన జీవనోపాధి 7.సరైన జ్ఞానం/చైతన్యం 8.సరైన ధ్యానం. మాట చాలా మహనీయమైనది.
లక్ష్యం దిశగా శ్రమిస్తున్న ఒక విద్యార్థికి ఇచ్చే ప్రోత్సహం ఈ ‘మాట’. ప్రియమైన వ్యక్తుల మోములో చిరునవ్వులు చిందించే అస్త్రం ఈ మాట. మనస్సును ముగ్ధపరిచే సమ్మోహన మంత్రం ఈ మాట. దుఃఖ సంద్రంలో ఉన్న వ్యక్తికి ఇచ్చే ఓదార్పు మాట. ఆఖరికి ఆత్మహత్యా పాతకానికి పూనుకుని ఉరికంబం ఎక్కదలిచే వ్యక్తి మనస్సును సైతం మార్చగల మంత్రం ఈమాట. దుఃఖ సంద్రంలో ఉన్న వ్యక్తికి ఇచ్చే ఓదార్పు ఈ మాట. ఆఖరికి ఆత్మహత్యా పాతకానికి పూనుకుని ఉరికంబం ఎక్కదలిచే వ్యక్తి మనస్సును సైతం మార్చగల మంత్రం ఈ మాట. బంధాలను పెంచే శక్తి బంధాలను తుంచే శక్తి మాటకు ఉంటుంది.
అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అద్భుతంగా మాట్లాడాలంటే అద్భుతంగా వినడం నేర్చుకోవాలి. దీనికి ప్రతీకగా మనకు భగవంతుడు రెండు చెవులనిచ్చి ఒక్క నోటిని మాత్రమే ఇచ్చాడు. మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలి. ‘అమృతం’లా మనిషికి శక్తినిస్తుంది ఈ మాట. అశోకవనంలో శోక సంద్రంలో మునిగిన సీతమ్మకు ఊరటనిచ్చిన హనుమంతుని మాటలే ఇందుకు నిదర్శనం. సీతమ్మకు ఆమె బాధను తొలగించి భరోసాను కలిగించి చిరునవ్వులు చిందించేలా చేసిన హనుమంతుని మాటలే దీనికి నిదర్శనం.
ఈ మాటలే కటువుగా వుంటే యమపాశంలా విషపు వృక్షంలా మనిషి ప్రాణాలను సైతం హరించగలవు. అగ్నికి ఆహుతి అయిన సతీదేవి వృత్తాంతమే దీనికి నిదర్శనం. దక్షుడు యజ్ఞాది క్రతువులు చేయదలచి అందరికీ ఆహ్వానం పంపాడు. కన్నకూతురైన సతీదేవి, అల్లుడైన మహాదేవున్ని ఆహ్వానించలేదు. కూతురికి ఆహ్వానం అవసరమా? అని భావించి అక్కడకు పయనమైంది సతీదేవి. కఠిన మాటలతో తనని, తన భర్తని నిందించారని అగ్నికి ఆహుతయ్యింది సతీదేవి. కాని ఆ తల్లి పేరిట అష్టాదశశక్తిపీఠాలు వర్థిల్లుతున్నాయ. చావు పుట్టుకలు లేని ఆ తల్లి తల్లితండ్రులకు తన పిల్లలతోటి మాట్లాడేటపుడు సంయమం పాటించాలని ఉద్బోధించిందని ఈ వృత్తాంతం మనకు చెబుతుంది.
తండ్రికి ఇచ్చిన మాటకోసం అడవులకు వెళ్లిన శ్రీరాముడు, అరణ్య అజ్ఞాతవాసాలు చేసిన పాండవులు, కవచ కుండలాలను సైతం దానం చేసిన కర్ణుడు, తన రక్తమాంసాలను ధారపోసిన బలి చక్రవర్తి, ఇలా ఎందరో.. మాట్లాడే ప్రతీ మాటనూ ఆలోచించి మాట్లాడాలి. ఆచరించే మాటలు మాత్రమే మాట్లాడాలి. బడాయి మాటలతో కోటలు నిర్మిస్తే అవి పేకమేడల్లా కూలిపోతాయి. నీటి మూటలలా ప్రయోజనం లేకుండా పోతాయి.
మాట్లాడే ప్రతీ మాటా సౌమ్యంగా, మధురంగా ఉండాలి. తోటి మనుష్యులను మన మాటలతో నొప్పించకుండా ఉండాలి. అందరినీ మాటలతో నొప్పించక మెప్పిస్తూ ప్రోత్సహిస్తూ... మనసా వాచా కర్మణా మహోన్నత వ్యక్తులుగా మారాలని ఆశిద్దాం.

-బెహరా రమ్య