రాష్ట్రీయం

భక్తులపైకి దూసుకెళ్లిన లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరిలో నలుగురు మహిళలు దుర్మరణం
కదిరి, ఫిబ్రవరి 15: అనంతపురం జిల్లా కదిరి పట్టణ సమీపంలోని కాళసముద్రం గ్రామం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రోడ్డు పక్కనేవున్న గంగమ్మ గుడి వద్ద వంట చేస్తున్న మహిళలపైకి లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుల్లో తనకంటి గంగభవాని (45), పి లక్ష్మీదేవి (55), గంగులమ్మ (55), వెంకటలక్ష్మమ్మ (50) ఉన్నారు. ఆనంద్, చంద్రమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కాళసముద్రం గ్రామానికి చెందిన వారే. ఏటా నిర్వహించే గంగమ్మ జాతర సందర్భంగా గ్రామస్థులంతా సోమవారం మధ్యాహ్నం ఓపక్క పూజాదికాలు నిర్వహిస్తుండగా, మరోపక్క వంటావార్పులో నిమగ్నమయ్యారు. ఇంతలో కదిరి నుంచి అనంతపురం వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డువారగా కూరగాయలు తరుగుతున్న మహిళలపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం సంభవించింది. డీఎస్పీ, సిఐలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.