రాష్ట్రీయం

భక్త జన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 15: సారలమ్మ ఆగమానికి ముందే మేడారం భక్తుల రాకతో ఓలలాడింది. సోమవారం కనె్నపెల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులైన పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్, కాక కనకమ్మ, కాక భుజంగరావు, లక్ష్మీబాయి, కాక సారయ్యలు సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆడేరాలను శుభ్రం చేసి సారలమ్మ తల్లిని మేడారం సాగనంపేందుకు కనె్నపెల్లి గ్రామం మొత్తం సిద్ధమవుతోంది. సోమవారం ఉదయం నుంచే పలు ప్రయివేటు వాహానాలతోపాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం తరలివచ్చారు. తమ ఇష్టదైవాలైన మేడారం సమ్మక్క- సారలమ్మ తల్లులు గద్దెలకు చేరే క్షణాలు సమీపిస్తుండటంతో అటు అధికారులలో ఇటు భక్తుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. బుధవారం కనె్నపెల్లి నుండి సారలమ్మ ఆగమనంతో మేడారం జాతర ప్రారంభమవుతుంది. పిల్లల కోసం పరితపించే తల్లులు సారలమ్మ రాకతో వల్లు పట్టి ప్రణమిల్లుతుండగా వారిని దాటుతూ సారలమ్మను తీసుకొస్తున్న ఒడ్డె మేడారం గద్దెలకు చేరుకొని సారలమ్మను ప్రతిష్టిస్తారు. ఈ అద్భుత క్షణాల కోసం భక్తజనం పరితపిస్తుంటారు. ఇటువంటి ఘట్టానికి ఒక్కరోజే సమయం మిగిలివుంది. జాతర కోసం దేవాదాయ మంత్రి రెండు రోజులుగా మేడారంలోనే మకాం వేసి అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్త చర్యలను చేపట్టారు. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా మంత్రుల పర్యటన మొక్కుబడిగాకాకుండా భక్తులకు సౌకర్యాల కోసం సాగుతుంది. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం మేడారంలోనే మకాం వేసింది. వేలాది పోలీసులతో మేడారంలో ముమ్మర గస్తీ చేపట్టనుండటంతో పాటు అన్ని శాఖల అధికారులు విధులలో చేరడంతో జాతర ప్రారంభానికి ముందే ప్రభుత్వ యంత్రాంగం భక్తుల సేవ కోసం సిద్ధమయ్యారు.