మెయిన్ ఫీచర్

బాధ్యతనెరిగిన భార్య ఆస్తిలాంటిదే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ రచయిత వీరేంద్రకపూర్ కలం నుంచి జాలువారిన ‘‘ఎ వండర్‌ఫుల్ వైఫ్’’ అనే పుస్తకం సామాజికంగా ఓ భార్యకు దక్కాల్సిన స్థానాన్ని గుర్తుచేస్తోంది. మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకులైన వీరేంద్ర కపూర్ సమకాలిన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలనెన్నింటినో స్పృశిస్తూ అనేక పుస్తకాలు రాశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే
‘‘ఎ వండర్‌ఫుల్ వైఫ్’’ పుస్తకం రచయితగా
తన బాధ్యతను మరింత పెంచిందంటున్నారు.

‘‘ఎ వండర్‌ఫుల్ బాస్’ అనే పుస్తకం
రాసేటపుడు చాలా మంది సహోద్యోగులు,
వారి భార్యలతో మాట్లాడేవాడినని,
ఈ సందర్భంలోనే మానవ సంబంధాలపై పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చిందని వీరేంద్ర కపూర్ అన్నారు. తన సహోద్యోగుల విజయం వెనుక వారి భార్యల పాత్ర ఎంతో ఉందనే విషయాన్ని గ్రహించినట్లు చెబుతున్నారు. తల్లిగా, భార్యగా, కుమార్తెగా, కోడలిగా ఆమె పోషించే విభిన్న పాత్రల సమ్మేళనమే ఈ పుస్తకం అని అంటున్నారు.

‘‘్భర్త అడుగుజాడలలో భార్య నడవాలంటారు పెద్దలు. కాని భార్య అడుగుజాడలలోనే భర్త నడవడం సమాజానికి, ఇంటికి ఎంతో మేలు’’ అని అంటారు ప్రముఖ రచయిత వీరేంద్ర కపూర్. ఆయన కలం నుంచి జాలువారిన ‘‘ఎ వండర్‌ఫుల్ వైఫ్’’ అనే పుస్తకం సామాజికంగా ఓ భార్యకు దక్కాల్సిన స్థానాన్ని గుర్తుచేస్తోంది. పూణెకు చెందిన వీరేంద్ర కపూర్‌ను మేనేజ్‌మెంట్ గురువుగా పిలుస్తారు. మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకులైన వీరేంద్ర కపూర్ సమకాలిన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలనెన్నింటినో స్పృశిస్తూ అనేక పుస్తకాలు రాశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ‘‘ఎ వండర్‌ఫుల్ వైఫ్’’ పుస్తకం రచయితగా తన బాధ్యతను మరింత పెంచిందంటున్నారు. ఈ పుస్తకం మార్కెట్లోకి విడుదలయిందంటే దీని వెనుక భార్యను కోల్పోయిన ఓ భర్త సహకారం ఎంతో ఉందని ఆయన సవినయంగా చెబుతున్నారు. భార్య విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే అతను సహకరించాడని అంటారు. ఇంట్లో ఓ స్ర్తి చేసే పనిని పురుషుడు ఎన్నటికీ చేయలేడని వీరేంద్ర కపూర్ ఘంటాపథంగా చెబుతున్నారు. భార్యగా తన కర్తవ్య నిర్వహణలో ఆమె సమర్థవంతగా వ్యవహరిస్తే భర్త సాధించే విజయానికి ఆమె దోహదపడినట్లేనని అంటారు. దాదాపు 12మంది సాధారణ పురుషులను ఎంపిక చేసుకుని వారితో మాట్లాడిన తరువాతే తానీ పుస్తకాన్ని పొందుపరిచానని చెబుతున్నారు. ఈ పుస్తకం రాయాలనే ఆలోచన ఎలా వచ్చిందని అడిగితే.. ‘‘ఎ వండర్‌ఫుల్ బాస్’ అనే పుస్తకం రాసేటపుడు చాలా మంది సహోద్యోగులు, వారి భార్యలతో మాట్లాడేవాడినని, ఈ సందర్భంలోనే మానవ సంబంధాలపై పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చిందని అన్నారు. తన సహోద్యోగుల విజయం వెనుక వారి భార్యల పాత్ర ఎంతో ఉందనే విషయాన్ని గ్రహించినట్లు చెబుతున్నారు. తల్లిగా, భార్యగా, కుమార్తెగా, కోడలిగా ఆమె పోషించే విభిన్న పాత్రల సమ్మేళనమే ఈ పుస్తకం అని అంటున్నారు. ఈపుస్తకంలో 12 కథలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం పెళ్లయిన భర్త దగ్గర నుంచి 35 ఏళ్ల వైవాహిక జీవితం గడిపిన వారి జీవితం, అనుభవాలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. ఈ పనె్నండు కథలు కూడా పుట్టుకతోనే వెండి, బంగారం స్పూన్‌తో పెరిగిన ధనవంతుల విజయగాథలు కానేకాదని, సాధారణ పురుషుల విజయం వెనుక వారి భార్యలు పోషించిన విశిష్ట పాత్రను తెలియజేసే విజయగాథలని అంటారు. ఏడాది క్రితం రాసిన ఈ పుస్తకం కోసం దాదాపు 50 మందిని కలిశాను. కొంతమంది తమ భార్యల పట్ల కనీసం తమ అభిప్రాయాలను చెప్పటానికే నిరాకరించారని చెబుతూ.. వారికి భార్యల పట్ల అలాంటి చులకన భావం ఉండటం బాధాకరమని అంటారు. ఈ 12 కథలు కూడా దేనికిదానికే వినూత్నంగా ఉంటాయని అన్నారు. తల్లి స్థానంలో ఉండే ఓ స్ర్తి మానసిక స్థితి బలంగా ఉంటుందని, ఇంట్లో ఎలాంటి కష్టం, నష్టం తలెత్తినా వాటిని మృధువుగా, గుట్టుగా పరిష్కరించే సత్తా ఆమెకే ఉందని అంటారు. దశాబ్ధాల క్రితం భార్యభర్తలకు జాయింట్ ఎక్కౌంట్ ఉండేదని, ఇపుడు ఎవరిది వారే నిర్వహించుకుంటున్నారని, పెళ్లి అంటే స్ర్తి, పురుషుల మధ్య ఇచ్చి, పుచ్చుకునే మానసిక బంధం అని అంటారు. నేటి యువతలో సహనం అనేది లోపించటం వల్ల విడాకుల రేటు పెరుగుతుందని చెబుతారు. ఇంతకీ వండర్‌ఫుల్ వైఫ్‌కు ఉండాల్సిన లక్షణాలను వివరిస్తూ..
బాధ్యత : భర్త, పిల్లలే కాకుండా కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించటం.
స్వీకరణ : ఇంట్లోనే కాదు సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్వీకరించటం.
గృహ వాతావరణం :ఇళ్లు అనగానే నాలుగు గోడలే కాదు అందులో ఉండే చక్కటి వాతావరణమే ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దుతుందని చెబుతూ అది స్ర్తి వల్లే వెచ్చదనంగా ఉంటుందని వీరేంద్ర కపూర్ తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఆడదానికి నీకేమి తెలుసు, ఇంట్లో తిని, పడుకోవటమనుకుంటున్నావా అని ప్రశ్నించే ఈ పురుషాధిక్య సమాజంలో ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం అని వీరేంద్ర కపూర్ చెబుతున్నారు. *