జాతీయ వార్తలు

బస్సీ..మిస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: జెఎన్‌యు వివాదం నేపథ్యంలో ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీకి కీలక పదవి దక్కకుండాపోయింది.కేంద్ర సమాచార కమిషన్(సిఐసి)లో కమిషనర్ల ఎంపికకు సంబంధించి జాబితాలో ఇప్పటి వరకూ బస్సీ పేరు ఉండేది. అయితే జెఎన్‌యులో ఆందోళనలు ఆపడంలోనూ, పాటియాల కోర్టు వద్ద ఘర్షణలు నివారించకుండా ఆయన ప్రేక్షక పాత్ర వహించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
కాంగ్రెస్ సహా అనేక ప్రజాసంఘాలు బస్సీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశాయి. దీంతో ముగ్గురు కమిషనర్ల ఎంపిక జాబితాలోంచి బస్సీ పేరును తొలగించారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ పదవి నుంచి త్వరలోనే ఆయన రిటైర్‌కానున్నారు. సిఐసిలో ఖాళీల భర్తీకి ఢిల్లీ హైకోర్టు ఆరువారాల గడువును విధించింది. నియామకాలు పూర్తి పారదర్శకంగా జరపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారంనాడిక్కడ ప్రధాన మంత్రి సౌత్‌బ్లాక్ ఆఫీసులో సమాశానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గేలు హాజరై తాజా పరిస్థితులపై చర్చించారు. పిఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రత్యేక ఆహ్వానితునిగా సమావేశానికి హాజరయ్యారు. బస్సీ నియామకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే తేల్చిచెప్పారు.
ఈ విషయాన్ని ఇంతకు ముందే తమ పార్టీ నేతలు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దీంతో బస్సీ పేరును జాబితా నుంచి తొలగించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 1977 బ్యాచ్ ఐపిఎస్ అధికారి బస్సీ సమాచార కమిషనర్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. కేబినెట్ కార్యదర్శి పికె సిన్హా అధ్యక్షన నవంబర్‌లో జరిగిన సర్చ్ కమిటీ బస్సీ పేరును ఖరారు చేసింది.