తెలంగాణ

భక్తకోటి నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం, ఫిబ్రవరి 19: ఆదివాసీల ఆరాధ్యదైవాలు... వరాల తల్లులు సమ్మక్క-సారలమ్మ గద్దెలను అలంకరించడంతో భక్తజనం పోటెత్తింది. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తల్లిబిడ్డలకు మొక్కులు చెల్లించుకునేందుకు ఒడిబాల బియ్యం, కొబ్బరికాయలు, నిలువెత్తు బంగారం(బెల్లం)తో తరలివచ్చారు. శుక్రవారం నాటికి కోటి 20 లక్షలకు పైగా భక్తజనం జాతరలో అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సంతానంలేని వారు బొమ్మలు సమర్పించి కడుపుపండాలని అమ్మవారులను వేడుకుంటున్నారు. అమ్మలకు ఎదురుకోళ్లను ఎగురవేసి తమ భక్తిపారవశ్యాన్ని చాటుకున్నారు. భక్తులు గద్దెల ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే పూనకాలతో ఊగిపోతున్నారు. శివసత్తులు క్యూలైన్‌లలో సైతం శివాలెత్తి భక్తివాతావరణాన్ని వేడేక్కిస్తున్నారు. భక్తుల రద్ధీ ఎక్కువ కావడంతో శుక్రవారం గద్దెల ప్రాంగణంలో పలుమార్లు తోపులాట జరిగింది. గద్దెల ప్రాంగణాలు భక్తులు వేసిన బంగారం, ఇతర కానుకలతో నిండిపోయి...గుట్టలను తలపించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు తమను చల్లంగా చూడాలంటూ అమ్మవార్లను వేడుకున్నారు. వనదేవతల నిండు జాతరశోభతో ఉట్టిపడుతున్న అమ్మవార్ల దర్శనానికి, మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పోటీ పడుతున్నారు. సాధారణ భక్తులతో పాటు అమ్మవార్ల దర్శణం కోసం విఐపిలు సైతం అధిక సంఖ్యలో హాజరయ్యారు. జాతర సందర్భంగా పదివేల మందికి పైగా పోలీసు సిబ్బంది విధులు నిర్వహించడం, వారికి తోడుగా తుడుందెబ్బ, కాకతీయ యునివర్సిటీ, తెలంగాణ జాగృతి, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటరీలతోపాటు పలు స్వచ్ఛంధ సంస్థలు, అధికార యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం పనిచేసారు. మేడారం జాతర పరిసర ప్రాంతాలలోని ముఖ్య కూడళ్లలో వందకు పైగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికార యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుంది.
అమ్మలను దర్శించుకున్న కోటి 20లక్షల మంది..
మేడారం సమ్మక్క-సారలమ్మలను ఇప్పటి వరకు కోటి 20 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆర్టీసి బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఎడ్లబండ్లు, కాలినడకన భక్తులు మేడారంకు తరలివచ్చి తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇప్పటికే శనివారాన్ని సెలవుదినంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం...ఆ మరునాడు ఆదివారం మరో సెలవు దినంకావడంతో జాతర ముగిసే నాటికి కోటిన్నరకు పైగా భక్తులు అమ్మలను దర్శించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నేడు జనం నుంచి వనంలోకి..
సమ్మక్క-సారలమ్మ తల్లులు శనివారం (నేడు) వనప్రవేశం చేయనున్నారు. సమ్మక్కతల్లి చిలకలగుట్టకు, సారలమ్మ కనె్నపల్లికి, పగిడిద్దరాజు కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజులు ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామాలకు తీసుకపోవడంతో జాతర ముగుస్తుంది. దేవతల వన ప్రవేశాన్ని కూడా ఆదివాసీలు తమ సాంప్రదాయ పద్ధతిలోనే జరిపిస్తారు.
24న తిరుగువారం
సమ్మక్క సారలమ్మ తిరుగువారం పండుగను ఫిబ్రవరి 24న పూజారులు ఘనంగా జరుపుకోనున్నారు. జాతర సందర్భంగా దేవతలను దుమ్ముకాళ్లతో తీసుకువచ్చినందుకు, పూజలలో ఏమైన తప్పిదాలు జరిగితే మన్నించాలంటూ వేడుకుంటూ ఈ తిరుగువారం పండుగను చేస్తారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గుళ్లను, గద్దెలను శుభ్రంగా కడుగుతారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, మేకలను దేవతలకు నైవేద్యం సమర్పించడంతో జాతరకు తెరపడుతుంది.
తిరుగుప్రయాణంలో భక్తులు
మేడారంలో అడవితల్లులను దర్శించుకున్న భక్తజనం శుక్రవారం ఉదయం నుండి తిరుగుబాట పట్టారు. మేడారంలో జాతర సందర్భంగా ఏర్పాటుచేసిన తాత్కాళిక ఆర్టీసి బస్టాండ్‌లో బస్సులకోసం ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు. తాము తీసుకువచ్చిన ప్రైవేట్ వాహనాలలో భక్తులు పోలీసులు ప్రవేశపెట్టిన వన్‌వే పద్ధతిలో దేవతలను స్మరించుకుంటూ తిరుగుప్రయాణం అయ్యారు.