కృష్ణ

బ్లాక్‌మెయిల్ కేసులో నిందితులను మా కస్టడీకి ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లాక్‌మెయిల్ కేసులో నిందితులను
మా కస్టడీకి ఇవ్వండి
* కోర్టును కోరిన పోలీసులు
* మిగిలిన ఆరుగురి కోసం గాలింపు
విజయవాడ , మార్చి 17: గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం బిషప్ ఫాదర్ మెరుగుమల్ల చిన్నప్ప (64) ను బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన కేసులో అరెస్టయిన నిందితులను పోలీసులు తమ కస్టడీకి కోరనున్నారు. రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులను మాచవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తొలుత నుంచీ కూడా ఈ కేసులో అనేక ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. మీడియాకు చెందిన కొందరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం ఊపందుకోవడంతో ఇటీవల వదంతులకు నగర పోలీసు కమిషనర్ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి నిందితులు ఎవరన్న అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే ఫాదర్‌కు అనుచరునిగా ఉన్న వ్యక్తే మరికొందరి సహకారంతో పక్కా ప్రణాళికతో మత్తు ఇచ్చి ఫాదర్‌పై వీడియో చిత్రీకరణ జరపడం ద్వారా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి డబ్బు దండుకున్నట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేయగా మరో ఆరుగురు నిందితులు అరెస్టు కావాల్సి ఉంది. అయితే నిందితుల అరెస్టు విషయంలో పోలీసులు అత్యంత గోప్యంగా వ్యవహరించడం గమనార్హం. ఫాదర్ చిన్నప్ప వద్ద సహాయకుడిగా వ్యవహరించే పాయకాపురం రాధానగర్‌కు చెందిన కొర్రపాటి జోసఫ్ (58) సహకారంతోనే ఈ వ్యవహారమంతా కొనసాగినట్లు చెబుతున్నారు. జోసఫ్ ద్వారా తెర మీదకు వచ్చిన సుధీర్ అనే వ్యక్తి పటమటలో సంజీవిని మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ అనే సంస్థలో ఫాదర్ చేత 50వేల రూపాయలు డిపాజిట్ చేయించాడు. ఈ వ్యవహారమంతా గత ఏడాది మే నెలలో జరిగింది. డిపాజిట్ చేయడం ద్వారా ఐదేళ్ళకు ఐదు లక్షలు వస్తాయని నమ్మించారు. అయితే ఈ సొసైటీ నకిలీగా పోలీసులు చెబుతున్నారు. ఆతర్వాత కొంతకాలానికి ఫాదర్ తన డబ్బు ఇవ్వాల్సిందిగా అడగడంతో అలాగేనని ఊ కొట్టి పథక రచన చేశారు. ప్రార్థన చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఫాదర్ చిన్నప్పను గత ఏడాది సెప్టెంబర్‌లో దొనబండలోని ఉమా హాలిడే ఇన్ రిసార్ట్స్‌కు తీసుకువచ్చారు. ఇక్కడ ఆయనకు భోజనంలో మత్తు కలిపారు. అపస్మారక స్థితిలో పడిపోగా ఆయనతో ఓ మహిళను నగ్న దృశ్యాలను చిత్రీకరించారు. కొన్ని రోజుల తర్వాత వీడియో దృశ్యాలను చూపించి ఫాదర్‌ను బెదిరిస్తు నిందితులు కోటిన్నర వరకు దండుకున్నారు. ఇంకా మరో నాలుగు కోట్లు కోసం డిమాండు చేయడంతో తన స్నేహితుడైన మువ్వల ప్రసాద్ సలహా మేరకు పోలీసు కమిషనర్‌ను కలిసి ఈనెల 11వ తేదీన ఫిర్యాదు చేయగా మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మీదట నిందితులైన యనమలకుదురుకు తాడిగడప డొంకరోడ్డుకు చెందిన మరీదు శశిధర్ (26), కొర్రపాటి జోసఫ్ (58), మండాది రామోజీ చౌదరి (29)లను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా ఈనెల 30వరకు న్యాయమూర్తి రిమాండు విధించారు. కాగా.. కేసులో మరింత విచారణ జరిపి సమాచారం రాబట్టాల్సి ఉన్నందున నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. దీంతో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మిలిగిన ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.