మెయిన్ ఫీచర్

గడ్డితో ‘గ్రీన్‌వుడ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదిహేనేళ్ల వయసులో వినూత్న పరిశోధన
యువ పారిశ్రామికవేత్తగా అవతరణ
యునిసెఫ్ గుర్తింపుతో ఖ్యాతి
చండీగఢ్ యువతి సంచలనం

సొంత తోటలో సాయంత్రం పూట తల్లిదండ్రులతో అలా తిరిగివస్తూంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది...
అందరిలాగానే బిస్మన్‌దేవ్ మనసూ అలా వెళ్లివచ్చినప్పుడల్లా ఉల్లాసంగానే ఉండేది. కానీ ఓసారి తమ పొలాల నుంచి ధాన్యం, గోధుమలు ఇంటికి తెచ్చాక మిగిలినపోయిన గడ్డిని తగులబెట్టడం చూసింది. తమలాగే వందలాది మంది రైతులు అలా మిగిలినపోయిన చొప్పను, గడ్డిని కాల్చేయడం, ఆకాశంలో నల్లని మేఘాలు అలుముకోవడం చూసి నిట్టూర్చింది. ఒక దశలో ఊపిరి తీయడం కూడా కష్టమైపోయేది..ఆ కాలుష్యంతో. చండీగఢ్‌లో తన వ్యవసాయ భూముల్లో పరిస్థితి ఇది. దిల్లీ చుట్టూ ఇలా కాలుష్యమేఘాలు అలుముకుంటాయని, ప్రపంచంలో ఎక్కడాలేనంత కాలుష్యం అక్కడ ఉందని తెలుసుకుంది. ఆలోచనలకు పదునుపెట్టింది. అంతే ఓ ఐడియా తట్టింది. తనలాంటి ఆలోచనలతో ఉన్న కొందరిని కూడగట్టింది. గడ్డి, చొప్ప, రైసిన్ కలపి ముద్దలా చేసి ‘గ్రీన్‌వుడ్’ పేరిట ఫలకాలు చేయొచ్చని కనిపెట్టింది. తయారుచేసింది కూడా. అది పెద్ద సంచలనంగా మారిపోయింది. చౌకగా, . ధృఢంగా, మన్నికనిచ్చేవిగా, ఇంటి నిర్మాణంలో కలప, రాయికి బదులుగా వాడుకునే విధంగా ఉండే ఆ ‘గ్రీన్‌వుడ్’కు ప్రపంచంలో విశేష ఆదరణ లభించడం మొదలైంది. ‘గడ్డిని రీసైకిల్ చేసి ప్రొటొటైప్ మెటిరీయల్‌గా మార్చి, రేసిన్‌తో మిళితం చేసి కలప ఫలకాలుగా’ తయారు చేయడం ఆమె చేసిన పని అన్నమాట. ఇదంతా పదిహేనేళ్ల వయసులో బిస్మన్ దేవ్ సాధించిన ఘనత. ఆమె కనిపెట్టిన గ్రీన్‌వుడ్ యునిసెఫ్ మెప్పు పొందింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో భావి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకుంటున్న వేలాది విద్యార్థులకు ‘పాఠాలు’ చెప్పడం మొదలెట్టింది. ఇదంతా 2015లో జరిగింది. ఇప్పటికీ ఆమె ఎన్నో దేశాల్లో, ఎన్నో వర్శిటీల తరపున అలా ‘పాఠాలు’ చెబుతూనే ఉంది. ఒకవైపు వ్యాపారం, మరోవైపు చదువు కొనసాగిస్తూనే ఉంది.
చండీగఢ్ నుంచి..
పుట్టింది చండీగఢ్‌లో. కానీ తల్లిదండ్రులతో కలసి ఇంగ్లండ్

వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత వారితో కలసి మళ్లీ ఇండియాకు వచ్చేసింది. చండీగఢ్‌లోని స్ట్రాబెర్రి ఫీల్డ్స్ హైస్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. అలా చేస్తున్నప్పుడే ‘గడ్డి’తో పర్యావరణహిత ‘గ్రీన్‌వుడ్’ను కనిపెట్టింది. ఆ తరువాత దానినే వ్యాపారంగా మార్చుకుంది. మరోవైపు లండన్‌వెళ్లి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తూ యూనిసెఫ్, మరికొన్ని విద్యాసంస్థల తరపున దేశవిదేశాల్లో పర్యటిస్తూ విద్యార్థులకు వ్యాపార మెళకువలు, పర్యావరణహిత పద్ధతులు, విధానాలపై తన అభిప్రాయాలను విస్తృత ప్రచారం చేస్తోంది.
యువతలు రాణించాలి
‘నాలుగో తరగతి చదివేటప్పుడు నా క్లాసులో మిగతావారికి పెన్సిళ్లు అమ్మేదాన్ని. ఇప్పుడు గడ్డితో చేసిన గ్రీన్‌వుడ్ అమ్ముతున్నా. మనసులోని ఆలోచనలను ధైర్యంగా చెప్పడం, స్వేచ్ఛగా ఆలోచించడం అవసరం. ముఖ్యంగా బాలికల్లో ఇది అత్యవసరం. అప్పుడే సంచలనాత్మక నవకల్పనలు సాధ్యం’ అంటోంది బిస్మన్ దేవ్. ప్రస్తుతం లండన్ వేదికగా యూనివర్శిటీ ఆఫ్ వార్‌విక్‌లో ఎకనామిక్స్, పాలిటిక్స్, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పీజీ చేస్తోంది. ‘కలర్ ది వరల్డ్ పింక్’ అన్న ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. వ్యాపార రంగంలో యువతులు అవకాశాలను సృష్టించుకోవాలని, సాధించుకోవాలని ఆమె ఈ ఉద్యమం ద్వారా పిలుపునిస్తోంది. అందుకోసం దేశవిదేశాల్లో పర్యటిస్తూ తనవంతు ప్రచారం చేస్తోంది. 2015లో ఆమె కనిపెట్టిన ‘గ్రీన్‌వుడ్’ ఇప్పుడు ఆమెకు క్షణం తీరికలేకుండా చేసింది. సరికొత్త ఆలోచన ఆమెకు కీర్తిని, కనకాన్ని అందించింది.