మెయిన్ ఫీచర్

ఒంటరిగా చుట్టేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహసంగా ముందుకు సాగిపోవాలని.. కొత్త అనుభవాలను మూటగట్టుకోవాలని.. ఒంటరి ప్రయాణంలో ఉండే మజాను ఆస్వాదించాలని నేడు మహిళలు తహతహలాడుతున్నారు. గతంతో పోలిస్తే ఒంటరిగా ప్రయాణం చేసేందుకు మహిళల్లో 44శాతం మంది ఇష్డపడుతున్నట్లు ఇటీవల జరిపిన సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఒంటరి ప్రయాణాలను ఇష్టపడే మహిళల కోసం ప్రత్యేకంగా క్లబ్‌లు, యాప్‌లు అందుబాటులోకి రావటంతో పాటు ట్రావెల్ ఏజెన్సీలు సైతం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తు వారిని ప్రోత్సహించటం తాజా సానుకూల పరిణామం.
దీంతో ఓంటరి ప్రయాణం అంటే విదేశీ వనితలు మాత్రమే చేస్తారని అపోహ ఆధునిక మహిళల్లో లేదు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఆఫీసు, క్యాంప్ పనిమీద మహిళలు సూదూర ప్రయాణాలకు సైతం ఒంటరిగానే వెళుతున్నారు. ప్రపంచాన్ని చుట్టేసేందుకు ఆధునిక అతివలు ఎంతో ఇష్టపడుతున్నారు. మహిళలు ఐదుసార్లు ప్రయాణం చేస్తే ఇందులో నాలుగుసార్లు ఒంటరిగానే వెళుతున్నారని సరికొత్త అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలా వెళ్లినవారు అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకుని తమ విలువైన జీవితాన్ని నలుగురికి ఉపయోగపడాలనే తపనతో ఎన్జీఓ సంస్థలను స్ఢాపించినవారూ ఉన్నారు. కాశ్మీర్ అందాలను చుట్టేయ్యాలన్నా.. న్యూయార్క్ సిటీలో కాక్‌టైల్ విస్కీ సేవించాలన్నా.. యూరోప్ సొగసులను సొంతచేసుకోవాలన్నా.. రోమ్‌లో షాపింగ్ చేయాలన్నా ఒంటరి ప్రయాణమే మంచిదని మహిళలు భావిస్తున్నారు. ఒంటరి ప్రయా ణం ఒక చక్కని అనుభూతి అంటున్నారు. ఒక్కరే కొత్త ప్రదేశాలకు వెళితే సరికొత్త అనుభూతులు, జ్ఞాపకాలు జీవితాంతం మిగులుతాయి. ఇలాంటి అనుభూతుల ను పంచుకుంటూ, ఒంటరి ప్రయా ణం చేసే మహిళలకు ప్రేరణగా నిలిచిన కొంతమంది మహిళల అనుభవాలను మనమూ తెలుసుకుందాం.
ఇవి చదివిన తరువాత మీరు కూడా కళ్లు మూసుకుని ప్రపంచపటంపై చూపు డు వేలును ఉంచి అది చూపించిన ప్రదేశానికి రెక్క లు కట్టుకుని వెళ్లగలమనే ధైర్యం వస్తుంది. మరింకెందుకు ఆలస్యం.

ట్రంప్ హోటల్‌లో బస అద్భుతం
నేను 2012లో అమెరికాలో ఒంటరిగా ప్రయాణించాను. అప్పటికే ఓ ఎస్జీఓ సంస్థలో పనిచేస్తున్నాను. వీసా ఉంది. ఈ ప్రయాణం అమెరికాలో స్థిరపడేందుకు దోహదం చేసింది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరిగేందుకు దోహదం చేసింది. ఎవ్వరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నవారు ఒంటరి ప్రయాణం చేయటం వల్ల కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఎక్కడకి వెళ్లినా సురక్షితంగా ఉండేలా బస చేయటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుని ప్రయాణానికి సిద్ధంకండి. అలా ఒంటరిగా ఇరవై ఏళ్ల క్రితం చేసిన న్యూయార్క్ సిటీ ప్రయాణం జీవితంలో మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ట్రంప్ హోటల్‌కు వెళ్లాను. ఆ హోటల్‌కు చేరుకోగానే ప్రయాణంలో నలిగిపోయిన దుస్తులను చూసి అక్కడ ఉన్నవారు నన్ను ప్రశ్నార్థకంగా చూశారు. ఆ చూపులను లెక్కచేయకుండా హోటల్‌కు వెళ్లి ప్రపంచ ప్రసిద్ధిచెందిన కాక్‌టెయిల్ విస్కీని సేవించాను. అక్కడ ఎవ్వరూ కూడా నా లగేజీని కాపాడేందుకు సహకరించలేదు. అయినప్పటికీ ఆధైర్యపడకుండా అక్కడ గడిపాను. కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి.
- జయశ్రీ మెనన్, గృహిణి

యూరప్‌లో సూపర్ పర్యటన
ఓంటరి ప్రయాణం మనల్ని మనం పరిశీలించుకోవటానికి ఎంతగానో దోహదపడుతుంది. చాలామంది ప్రజలు ఏదో శోధించటానికి హిమాలయాలకు వెళతారు. నాకు మాత్రం యూరప్‌లో ట్రెయిన్‌లో ప్రయాణించటం తీపి జ్ఞాపకంగా నిలిచిపోయింది. గత సంవత్సరం కూడా యూరప్‌లో ఏడు దేశాలను, ఎనిమిది సిటీలలో ఒంటరిగా ప్రయాణం చేశాను. 2010లో లిస్బన్ మళ్లీ వెళ్లాను. ఎక్కడైతే బస చేశానో అక్కడకి వెళ్లాను. కాని అక్కడ నాకు తెలిసినవారు తారసపడలేదు. కాని కొత్త స్నేహాలు కలిగాయి. మార్పు కోసం ధైర్యంగా అడుగు ముందుకు వేయండని ఇటీవల జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు చేసిన ప్రతిజ్ఞను గుర్తుకు చేసుకుంటూ మహిళలు ఎక్కువగా ఒంటరి ప్రయాణానికి. కాకపోతే కొన్ని ముందుకు జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు అనుకోని ఆపద సంభవించినపుడు ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటే ఒంటరి ట్రిప్‌ను ఎంజాయ్ చేయటం ఓ చక్కటి అనుభూతే.
- ఎం. సంధ్య, రైయిన్ ట్రీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్

బడ్జెట్ వేసుకోండి
సెలవుల్లో నేను, నా స్నేహితులు యూరప్ వెళ్దామని ప్లాన్ చేశాం. కాని నాకు రోమాంటిక్ రోమ్ వెళ్లాలనే కోరిక. దీంతో వారి నుంచి విడిపోయి ఒంటరిగా రోమ్ వెళ్లాను. ఇరవై ఏళ్ల క్రితం ఇంటర్నెట్ కూడా లేదు. నాకు నేనుగానే రోమ్ ట్రిప్‌ను ఎంజాయ్ చేశాను. ఇపుడు సాంకేతికి పరిజ్ఞానం అందుబాటులో ఉండటం వల్ల ఒంటరిగా ప్రయాణం చేయటం పెద్ద కష్టం కాదు. అయితే ప్రయాణానికి ముందు బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవం మరచిపోవద్దు. డబ్బులు, డెబిట్, క్రెడిట్ కార్డులు అన్నీ కూడా మీ వద్దనే ఉంచుకోండి. ప్రయాణానికి ఎంత ఖర్చవుతుందనే అంచనా వేసుకుని వెళితే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఈ పర్యటన సందర్భంగా రోమ్‌లో కొంతమందిని స్నేహితులుగా మలుచుకున్నాను. రోమ్ పర్యటనలో గతంలో ఎన్నడూ చవిచూడని అనుభవాలను పొందాను. ఈ అనుభూతులను, అక్కడి రుచులను స్నేహితులతో పంచుకున్నాను.
- ప్రీతి పి.మిట్టల్, జ్యూయలరీ డిజైనర్