బిజినెస్

21 రోజుల్లోనే అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులను 21 రోజుల్లోనే మంజూరు చేస్తామని జర్మనీలోని పలు కంపెనీల ప్రతినిధులకు పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి హామీ ఇచ్చారు. నవ్యాంధ్రకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విదేశీ పర్యటన కొనసాగిస్తున్న మంత్రి బుధవారం హాంబర్గ్ (జర్మనీ)లో జర్మన్ ఆసియా - పసిఫిక్ బిజినెస్ అసోసియేషన్, హంబర్గ్ ఫారిన్ ట్రేడ్ ప్రమోషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్, షిప్ బిల్డింగ్ పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలు, వౌళిక వసతులు గురించి వివరించారు. రొయ్యలు, మిరప, మామిడి, టమోటా, ఫిష్, మాంసం (మీట్)ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలంగా దొరకుతాయని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఏపీ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఏపీ 12 శాతం వృద్ధి సాధించిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానంలలో ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పాలసీలను అమలు చేస్తుండడంతో కియా లాంటి ప్రపం చ స్థాయి కంపెనీ ఏపీలో పెట్టుబడు లు పెట్టిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో రెండు అత్యున్నత పారిశ్రామిక కారిడార్లు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పటికీ ఏపీలో పారిశ్రామికాభివృద్ధి పెద్దఎత్తున జరుగుతోందని, ఏపీలో కంపెనీలు ఏర్పాటు చేసే వారికి పలు రాయితీలు ఇస్తామన్నారు. కాగా ఈ నెల 24 నుంచి విశాఖలో ప్రారంభమ య్యే భాగస్వామ్య సదస్సులో పాల్గొంటామని పలు కంపెనీల ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రీతమ్ రెడ్డి, ఈడీబీ అధికారులు పాల్గొన్నారు.