Others

స్వచ్ఛ కీర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక మంచి పని చేయడంవల్ల పదిమంది మెచ్చుకొంటారు, ఇదే ప్రశంస, దీనినే కీర్తి అంటారు. కీర్తించడం అనే మాటకు పొగడడం అనే అర్థం కూడా వుంది. ఈ కీర్తి ఒక్కచోట ఉండదు. ఆనోటా ఈనోటా పడి దశ దిశల్లో వ్యాపిస్తుంది.
కీర్తిగానీ, అపకీర్తిగానీ మహావేగంగా పయనిస్తుంది. క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోతుంది. అపకీర్తి వస్తే తట్టుకోలేరు. బాధపడుతారు. కాని కీర్తి వస్తే మహాసంతోషం వేసింది అంటారు. మరి సంతోషం కలిగే పనులు చేస్తున్నారా అంటే ఆలోచిస్తారు. అందుకే ఏపనినైనా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. నలుగురి మంచి కోరి చేయాలి. స్వార్థం విడనాడాలి. తను ఒక్కడే బాగుండడం కాక నలుగురూ బాగుండాలని కోరుకోవాలి. అట్లాంటి మంచి ఆలోచనలు కలిగి ఉంటే కీర్తి దానంతట అది వస్తుంది.
పరీక్షలో విద్యార్థి ప్రథమ శ్రేణిలో ప్రప్రథమంగా నిలిచాడు. ఇది అతని కీర్తికి కారణ మవుతుంది. అదే తాను చదువుకుంటూ తనతో చదువుకునేవారిలో ఎవరైన వెనుకబడి ఉంటే వారికి కూడా చదువు చెప్పి సులువు మార్గాలు చెప్పి వారిని కూడా పరీక్షల్లో కృతార్థలను చేయడంలో సాయం చేస్తే ఇపుడు వచ్చిన కీర్తి కన్నా ఎక్కువ కీర్తి వస్తుంది. సాయం పొందినవారు మరింత మందితోనీ సాయగుణాన్ని చెప్తారు. పైగా వారు కూడా నీలాగా మారడానికి ప్రయత్నిస్తారు. ఇపుడు ఎక్కువ మంచి జరిగింది కనుక ఎక్కువ కీర్తి వస్తుంది. అట్లా అని కీర్తి కోసమే పని చేయకూడదు. అది కృతిమంగా మారుతుంది. అది మంచి కీర్తిని సంతృప్తి నివ్వదు. పరిశోధనలో శాస్తవ్రేత్త స్వైన్‌ఫ్లూ ఔషధాన్ని కనుగొన్నాడు. వ్యవసాయంలో బాగా దిగుబడి వచ్చే వంగడం కర్షకుడే పదిమందికి అందించాడు. తన పరిశ్రమలో యజమాని నాణ్యమైన ఉత్పత్తులు తీస్తున్నాడు. యుద్ధంలో అగ్రభాగాన నిలిచి సైన్యాధికారి శత్రుసేనలను తరిమేశాడు. చెట్లనుంచి వాహనాలకుపయోగించే ఇంధనాన్ని తయారుచేసే విధానాన్ని ఓ యువ మేధావి కనుగొన్నాడు. మనస్సులోకి దురాలోచనలు రాకుండా నిరోధించే పరికరాన్ని ఓ మనస్తత్వశాస్తవ్రేత్త లోకం ముందుంచాడు. ఇంకేం! వీళ్లందరినీ లోకం కీర్తిస్తుంది. వీరి కృషిని తరతరాల వారికి అందిస్తుంది. కనుక ఇట్లాంటి ఆదర్శవంతమైన పనులు చేస్తే అది మన దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తాయ. ప్రపంచదేశాల్లో మన జాతి ఉన్నతిని పెంచుతాయ. ఇలా చేసిన వారి అనుభవాలు తరువాతి తరాలకు పాధేయాలు కావాలని అందరూ కోరుకుంటారు. నాకు అధికారముంది, జ్ఞానముంది, ధనముంది, శక్తివుంది, నేను వీటిద్వారా ఈ లోకానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో, ప్రేమతో సేవ చేయాలి. మనస్సు, కీర్తివల్ల వచ్చే ప్రశంస రెండూ స్వచ్ఛంగా ఉండాలి. అలాంటి స్వచ్ఛమైన కీర్తే నిజమైన కీర్తి.

- జి. కల్యాణి