జాతీయ వార్తలు

బలపరీక్షలో రావత్ గెలిచారు: బిజెపి ఎమ్యెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం జరిగిన బలపరీక్షలో మాజీ సిఎం హరీష్ రావత్ గెలిచారని బిజెపి ఎమ్మెల్యే గణేష్ జోషి చెప్పడం సంచలనం కలిగించింది. తనకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది గనుక హరీష్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేయగా, ఇదే విషయాన్ని విపక్ష ఎమ్మెల్యే జోషి చెప్పడం గమనార్హం. బిజెపికి 28 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తేలిందని బలపరీక్ష అనంతరం జోషి విలేఖరులకు తెలిపారు. ఆయన చెప్పింది నిజమే అయితే హరీష్ రావత్ మళ్లీ సిఎం కావడం ఖాయం. సీల్డ్ కవర్‌లో ఉన్న ఫలితాన్ని బుధవారం నాడు సుప్రీం కోర్టు ప్రకటిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పడంతో ఉత్తరాఖండ్ రాజకీయ భవితవ్యంపై మరికొద్ది గంటలపాటు ఉత్కంఠ కొనసాగే పరిస్థిత ఏర్పడింది. బలపరీక్షలో కాంగ్రెస్‌కు 33, బిజెపికి 28 ఓట్లు వచ్చాయని మీడియా సంస్థలు కూడా చెబుతుండడంతో హరీష్ రావత్ తిరిగి సిఎం పదవి చేపడితే ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లే.