తెలంగాణ

దొంగబాబా లీలలు ఎనె్నన్నో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఓ వ్యాపారవేత్త ఇంట్లో పూజలు చేసినట్టు నటించి 1.3 కోట్ల రూపాయలతో ఉడాయించిన దొంగబాబా ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పెండగాంపల్లికి చెందిన బుద్దప్పగారి శివ బాబా అవతారం ఎత్తి పలు ప్రాంతాల్లో ఎంతోమంది భక్తుల నుంచి భారీగా డబ్బులు దోచుకున్నాడు. శివబాబాగా, శివస్వామిగా ప్రచారం చేసుకున్న ఇతను గతంలో తిరుపతి, నెల్లూరు, కూకట్‌పల్లి, హొస్నూరు (కర్నాటక) ప్రాంతాల్లో మోసాలు చేశాడు. 2014లో తిరుపతిలోని అలిపిరి పోలీసులు ఇతడ్ని అరెస్టు చేసి కోటి రూపాయల నగదుతో పాటు పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బెయిల్‌పై బయటికి వచ్చిన ఈ బాబా ఆ తర్వాత కూడా పలు చోట్ల భక్తులను బురిడీ కొట్టించాడు. తాజాగా బంజారాహిల్స్‌లో భక్తులకు మత్తుమందు కలిపిన పరమాన్నం ఇచ్చి భారీగా నగదు కాజేసి పలాయనం చిత్తగించాడు. ఈ బాబాను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.