తెలంగాణ

నకిలీ బాబా నుంచి రూ.1.20 కోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ వ్యాపారవేత్త కుటుంబాన్ని మోసం చేసి 1.33 కోట్ల రూపాయలతో ఉడాయించిన నకిలీ బాబాను అరెస్టు చేసి 1.20 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బాబా శివానందను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. తాజాగా బాబా 1.33 కోట్లు దోచుకోగా 1.20 కోట్లు మాత్రమే అతని నుంచి రికవరీ చేశారు. మిగతా సొమ్ము గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో బాబా చేసిన మోసాల గురించి కూడా ప్రశ్నిస్తున్నారు. కాగా, పూజలు జరిపించేందుకే శివానందను తీసుకువచ్చామని, డబ్బు రెట్టింపు అవుతుందన్న ఉద్దేశంతో కాదని లైఫ్‌స్టైల్ యజమాని మధుసూదనరెడ్డి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.