రాష్ట్రీయం

పాత వాసన పోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారులు నిద్రావస్థ వీడాలి * సిఎం చంద్రబాబు వ్యాఖ్యలు

ఆత్మకూరు, నవంబర్ 22: గత పదేళ్ల కాంగ్రెస్ పాలనతో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయని, ఇప్పుడు కూడా అదే మాదిరి నిర్లక్ష్య ధోరణి ఇంకా వివిధ శాఖల అధికార యంత్రాంగంలో చోటుచేసుకోవడం తగదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆదివారం ఆయన నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నుంచి కండలేరు (తెలుగుగంగ) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వస్తే తప్ప జిల్లాలో వరద సహాయక చర్యలు ప్రారంభానికి నోచుకోలేదంటూ ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందించారు. సాధారణంగానే నాయకుడు వచ్చినప్పుడు పరిస్థితుల్లో ఒకింత వేగిరమవడం జరుగుతుందన్నారు. ఏదేమైనా గత ప్రభుత్వాలతో పోలిస్తే తాను రాకున్నా, మా వాళ్లతోనే వెయ్యి రెట్ల సత్ఫలితాలు ఒనగూరుతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. పనిచేయని వాళ్లని అడిగినా నిష్ప్రయోజనమని, ప్రజల్లో నిస్తేజం భావన నెలకొని ఉంటుందన్నారు. అదే చేసేవాళ్లని చూడగానే మరిన్ని డిమాండ్లు పుట్టుకొస్తాయన్నారు. ఆ కోవలో తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారన్నారు. గతంలో తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు వరదలు వస్తే తూర్పుగోదావరి జిల్లాలో ధర్నా చేసిన సంగతి కూడా గుర్తు చేశారు. అప్పుడు ప్రజలు కనీసం తాగునీటికి కూడా నోచుకోక అవస్థలు పడ్డారన్నారు. ఓవైపున ముంపుతో, మరోవైపున ప్రభుత్వం తరపున పలికరించే నాధుడే కరవై అగచాట్లు పడ్డారన్నారు. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదుకదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. (చిత్రం) సోమశిల ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతున్న చంద్రబాబు