రాష్ట్రీయం

ఇదేంపని కెసిఆర్!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయకులను కొనేస్తారా?
పోయేది తెరాస పార్టీ ప్రతిష్ఠే
పార్టీ నేతల భేటీలో బాబు ఆగ్రహం
హైదరాబాద్, డిసెంబర్ 6: తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబుకు తెలంగాణ రాష్ట్ర సిఎం కె. చంద్రశేఖర్‌రావుపై మళ్లీ కోపమొచ్చింది. తెదేపా ఎమ్మెల్యే జి సాయన్నను తెరాసలో చేర్చుకోవడమేమిటి? ఇలా అనైతిక చర్యలకు పాల్పడుతూ రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోవున్నా, ఎవరినీ పార్టీ ఫిరాయించాల్సిందిగా ఒత్తిడి తేవడం లేదని, ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదన్నారు. ఎవరైనా వారి పార్టీ సిద్ధాంతాలు నచ్చకనో, లేక తెదేపా సిద్ధాంతాలు, చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిపట్ల ఆకర్షితులై తెదేపాలో చేరేందుకు ముందుకొస్తేనే చేర్చుకుంటున్నట్టు చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యే (తలసాని శ్రీనివాస్‌యాదవ్)ను తీసుకెళ్ళి మంత్రివర్గంలో చేర్చుకున్నారని, కనీసం ఆయనతో శాసన సభ్యత్వానికైనా రాజీనామా చేయించలేదని బాబు రుసరుసలాడారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ తెదేపా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు జి మోహన్‌రావు తదితరులు చంద్రబాబును కలిసారు. ఈ సందర్భంగా సాయన్న పార్టీ ఫిరాయించడం ప్రస్తావనకు వచ్చింది. సాయన్నకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలిచిందని, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సభ్యునిగా నియమించి గౌరవించడం జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. తమ పార్టీ నేతలను ఏదోరకంగా తెరాస లాక్కుంటోందని, ఇలాచేస్తే ఆ పార్టీ ప్రతిష్టే మంటగలుస్తుందని బాబు విమర్శించారు. పార్టీ నేతలు ఫిరాయింపులకు పాల్పడినా, కార్యకర్తలు చెక్కుచెదరకుండా ఉన్నారని, పార్టీ కోసం అంకితమైన భావంతో పని చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. పార్టీని ఎవరూ వదిలి వెళ్ళకుండా చూడాలని నేతలకు సూచించారు. ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని తెరాస నిలువరించకుంటే ఆ పార్టీ ఘోరంగా దెబ్బతింటుందని జోస్యం చెప్పారు. ఫిరాయింపులతో ఢీలాపడరాదని, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సమాయత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మిత్రపక్షమైన బిజెపితో సమన్వయంతో ఉంటూ, ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలని చంద్రబాబు వారికి సూచించారు.