జాతీయ వార్తలు

ఢిల్లీలో సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీలను అమలుచేయాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారంనాడు ధర్మపోరాట దీక్షను దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టారు. దీక్షకు ఏపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. దీక్షకు మద్దతుగా పలు జాతీయ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడుతున్నానని అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నామని చెప్పారు. చేసిన తప్పుకు క్షమాపణలు వేడుకోవాలని ఆయన మోదీని డిమాండ్ చేశారు.