కృష్ణ

గుణదల మాత తిరునాళ్లకూ వస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, డిసెంబర్ 25: దక్షణ భారతదేశంలో రెండో అతిపెద్ద కతోలిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఫిబ్రవరి 9,10,11 తేదిలలో జరిగే గుణదలమాత మహోత్సవాలలో కూడా తాను పాల్గొంటానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. శుక్రవారం ఉదయం గుణదల మేరిమాత పుణ్యక్షేత్రంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని ఆయన ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ మానవాళి శాంతి కోసం పరితపించిన వ్యక్తి క్రీస్తుప్రభువని, ఆయన బోధనలు అందరికి మార్గదర్శకం కావాలన్నారు. క్రీస్తుప్రభువు మనిషిగా మనుషుల్లో పుట్టి కష్టాలు అనుభవించి ప్రపంచ మానవాళికి అద్భుతమైన సందేశమిచ్చిన మహోన్నతుడు ఏసుక్రీస్తు అన్నారు. దీనులను, అనాధులను, రోగపీడితులను అక్కున చేర్చుకొని వారిపై ప్రేమ, కరుణ కురిపించారని తెలిపారు. రాత్రి పగలు తేడాలేకుండా ప్రజల కోసం పనిచేస్తా.. ప్రజల పక్షాన అండగా వుంటానని పేర్కొన్నారు. ప్రతి పేదవాడు అనందోత్సహాల మధ్య క్రిస్మస్ జరుపుకోవాలని చంద్రన్న క్రిస్మస్ కానుకను అందిస్తున్నామన్నారు. బియ్యం, పప్పులు, నూనేతోపాటు, 100 గ్రాముల నెయ్యి కూడా ఇస్తున్నామని తెలిపారు, నూతన రాష్ట్రంలో రాజధాని కట్టుకోవాలి, కాలేజిలు నిర్మించుకోవాలని, పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవాల్సి వుందన్నారు. ఆర్ధిక ఇబ్బందులు వున్న సంక్షేమానికి, నిత్యవసర వస్తువుల సరుకుల పంపిణీకి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. క్రిస్మస్ పర్వదినం రోజున గుణదలమాత పుణ్యక్షేత్రానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గుణదలమాత పుణ్యక్షేత్రంను అభివృద్ధి చేస్తానని తెలిపారు. గుణదలమాత పుణ్యక్షేత్రానికి మరింత ప్రాముఖ్యత వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉదయం 9.45 గంటలకు గుణదలమాత పుణ్యక్షేత్రంకు చేరుకోగానే పుణ్యక్షేత్రం రెక్టర్ చిన్నప్ప, ఎస్‌స్‌సి డైరెక్టర్ ఫాదర్ మువ్వలప్రసాద్ తదితర గురువులు స్వాగతం పలికి ప్రధాన దేవాలయంకు తీసుకొని వెళ్ళారు. ముఖ్యమంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. గుణదలమాత పుణ్యక్షేత్రం రెక్టర్ చిన్నప్ప మేరిమాత మోమొంటోను సి.ఎంకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, శాసనసభ్యులు బొండా ఉమమహేశ్వరరావు, గద్దె రామమోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జిల్లా నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, కలెక్టర్ బాబు.ఎ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్‌కలెక్టర్ జి.సృజన, క్రైస్తవ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

గుణదలలో వైభవంగా క్రిస్మస్
పటమట, డిసెంబర్ 25: గుణదల మాత పుణ్యక్షేత్రంలో శుక్రవారం వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. పుణ్యక్షేత్రం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజాపీఠంపై విజయవాడ కతోలిక పీఠం మోన్‌సిజ్ఞోర్, గుణదల మాత పుణ్యక్షేత్రం రెక్టర్ యం.చిన్నప్ప, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్రం సుహాయ గురువులు ‘క్రిస్మస్ సమిష్టి దివ్య పూజాబలి’ సమర్పించారు. బాలఏసు జననం రాకను స్తుతిస్తూ మోన్‌సిజ్ఞోర్ చిన్నప్ప బాల ఏసుకు సాంబ్రాణి ధూపం వేశారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నప్ప భక్తులకు క్రిస్మస్ సందేశమిస్తూ క్రిస్ అంటే క్రీస్తు అనీ, మస్ అంటే ఆరాధించడమని, క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ అని తెలిపారు. క్రీస్తు బోధించిన క్షమాగుణం, సహోదర ప్రేమ, కరుణను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని అన్నారు. అనంతరం గురువులు భక్తులకు దివ్యసత్ప్రసాదం అందజేశారు. భక్తులతో గుణదల మాత పుణ్యక్షేత్రం కళకళలాడింది.