ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: తక్కువ ధరకే ఫోన్, ఇంటర్నెట్, టీవీ ప్రసారాలను అందించే ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు విశాఖలో గురువారంనాడు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సిస్కో చైర్మన్ జాన్‌టిచాంబర్స్, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి హాజరైన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసిన బాబు ఫైబర్‌గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టారు. సమాచార, ప్రసారం రూపురేఖలు మార్చే ప్రాజెక్టుగా దీనిని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఐదు గ్రిడ్‌లను రూపొందించాలని భావిస్తున్న ప్రభుత్వం మొదటగా ఫైబర్‌గ్రిడ్‌పై దృష్టి సారించింది. దీనిని మొదట ఉత్తరాంధ్ర జిల్లాల్లో అమలు చేస్తున్నారు. విశాఖ ఆంద్ర యూనివర్శిటీలోని దూరవిద్య కేంద్రం సమీపంలో ఇందుకోసం ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు.