రాష్ట్రీయం

బాబు పాలన అంతా మోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకాపా అధినేత వైఎస్ జగన్ ధ్వజం

నెల్లూరు , నవంబర్ 26: ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా పరిపాలనంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోస పూరితంగా సాగిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. గురువారం నెల్లూరు నగరంలో వరద బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మోసాలపై నడుస్తోందని ఆరోపించారు. ఆక్రమణల పేరుతో నెల్లూరులో తొలగిస్తున్న ఇళ్ళను ముందుగా సంపన్నుల ఇళ్ళను తాకిన తరువాతే పేదవారి జోలికి రావాలని చెప్పారు. కాలువలపై నివసించే నిరుపేద వారికి పట్టాలు, ఇళ్లు కట్టించిన తర్వాత ఆక్రమణలను తొలగించాలని సూచించారు. గత ఎన్నికల్లో బూటకపు వాగ్దానాలు ఇచ్చి ఓట్లు దండుకునేందుకు ప్రజలను మోసం చేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏ హామిని కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ అని చెప్పి కనీసం ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వకూడా ఇవ్వలేదని, అదే విధంగా డ్వాక్రా మహిళల రుణాలు, ఇంటింటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతికి 2వేల రూపాయలను ఇస్తామని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. వరద నష్ట పరిహారాన్ని ప్రతి ఒక్కరికి అందించకుండా కొంతమందికే ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. వరద సాయం నిధులు మంజూరు చేయకుండా ప్రజలను రెచ్చగొట్టి అధికారులను నిలదీయండని చెప్పడం ఘోరమైన చర్య అన్నారు. వరద బాధితులకు పూర్తి సహాయం అందే వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన ఉండి పోరాటం చేస్తుందని చెప్పారు. (చిత్రం) నెల్లూరు నగరంలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఒక వృద్ధురాలిని పలుకరిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్