ఆంధ్రప్రదేశ్‌

ఆ డిమాండ్లు తీరిస్తే దిల్లీ వస్తా : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు దిల్లీలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుండగా, కొన్ని డిమాండ్లను అంగీకరిస్తేనే తాను దిల్లీ వస్తానని సిఎం చంద్రబాబు షరతులు విధిస్తున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం ఉదయం చంద్రబాబుకు ఫోన్ చేసి దిల్లీ రావాల్సిందిగా కోరారని సమాచారం. అయితే, 8 ప్రధాన డిమాండ్లను తీర్చేందుకు సమ్మతిస్తేనే ప్యాకేజీ విషయమై తాను ఆలోచిస్తానని చంద్రబాబు కేంద్రానికి స్పష్టం చేసినట్లు తెలసింది. పరిశ్రమలకు రాయితీలు, విశాఖకు రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదాకి, ప్యాకేజీకి కేంద్ర నిధుల కేటాయింపులో ఉన్న 30 శాతం తేడాను భర్తీ చేయాలని బాబు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక లోటు ఎంత ఉన్నా కేంద్రం భర్తీ చేయాలని ఆయన కోరుతున్నారు. తన డిమాండ్లపై కేంద్రం స్పష్టమైన హామీ ఇస్తే మంత్రులతో చర్చించి, ప్యాకేజీపై చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉందంటున్నారు.