బిజినెస్

ఫైబర్‌గ్రిడ్‌లో భూగర్భ కేబుల్ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాచారాన్ని క్రోడీకరించేందుకు కార్పొరేషన్ : చంద్రబాబు నాయుడు వెల్లడి

విశాఖపట్నం, మార్చి 17: ఫైబర్‌గ్రిడ్ మలి దశ విస్తరలో రాష్ట్రం అంతటా భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తొలి దశ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును విశాఖలో గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా సాంకేతిక భాగస్వామి సిస్కో చైర్మన్ జాన్ టి చాంబర్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడారు. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు తెలిపారు. దాదాపు 4,700 కోట్ల వ్యయంతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో తొలి దశ పనులను రూ.330 కోట్లతో పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. స్వల్ప వ్యయంతో 13 జిల్లాల్లో ఫైబర్‌గ్రిడ్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. అయితే సాంకేతికంగా పూర్తి సామర్ధ్యాన్ని సాధించేందుకు భూగర్భ కేబుల్ వ్యవస్థను రెండో దశలో చేపట్టి పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వడంతో పాటు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించి, అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం లేదా ప్రభుత్వ, ప్రైవేటు జాయింట్ వెంచర్‌లో కార్పొరేషన్ పనిచేస్తుందన్నారు. సామాన్యునికి సైతం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరింత ప్రగతి సాధించేందుకు మార్గం సుగమనమైందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో సమాచార విప్లవం మారుమూల ప్రాంతాలకు విస్తరించిందని, ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఒక్కరికీ సాంకేతిక ఫలాలను అందుబాటులోకి తీసుకురావాలన్న కలను సాకారం చేస్తామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో నిత్యావసర సరకుల పంపిణీ, సామజిక పింఛన్ల పంపిణీ తదితర అంశాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని, ఆధార్ అనుసంధానం ద్వారా మరింతగా అర్హులకు ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తెచ్చే అవకాశం మెరుగవుతుందన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఫైబర్‌గ్రిడ్ సేవల ద్వారా ప్రతి ఇంటిలోనూ సాంకేతికత వెల్లివిరుస్తుందన్నారు. రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, వైద్యులు ఇలా అన్ని వర్గాల వారు తమ అనుభవాలను ఇతరులతో పంచుకునే వీలు కలుగుతుందన్నారు. భవిష్యత్ అభివృద్ధికి ఇది తొలి మెట్టని, సాంకేతికంగా రాష్ట్ర ప్రగతిని ఉన్నత శిఖరాలను అందుకుంటుందన్నారు. సమావేశంలో మంత్రులు పల్లె రఘునాధరెడ్డి, గంటా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
(చిత్రం) ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించాక విద్యార్థులతో మాట్లాడుతున్న చంద్రబాబు