సబ్ ఫీచర్

బడినుంచే ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి కావల్సింది కేవలం ఆనందం ఒక్కటే. పూరిగుడిసెలో ఉన్నా, ఏడంస్తుల మేడలో ఉన్నా ఆనందం లేకపోతే మనిషి మనిషిగా ఉండలేడు. ఆనందానికి ఆడమగ తేడాలేదు. ఆనందాన్ని మించిది ఏదీలేదు. ఆనందం లేకపోతే ఆ మనిషికి విశ్వామిత్రుడు కోరినట్లు ఏనుగుఅంబారిపై నిలబడి రూకను పైకి విసిరితే ఎంత ఎత్తు కుపోతుందో అంత డబ్బును ఇచ్చినా వారికి లేశమాత్రం ఆనందం పొందడు. రహదారి పక్కన ఉన్నా వారికి తినడానికి లేకపోయినా వారి మనసు ఆనందంగా ఉంటే చాలు వారి ముఖం చూడబుద్దేస్తుంది. ఈ ఆనందం రావాలంటే అది ఎక్కడో లేదు. అందరి మనస్సులో అట్టడుగు పొరలో కూర్చుని ఉంటుంది. దాన్ని పైకి తీసుకొని రావాలి. దీనికి సాధనం ఎవరి దగ్గర ఉందో తెలుసా మీకు ఆడవారిదగ్గరే నండీ బాబూ!
అవును నిజమే చెబుతున్నాం. ఇంతకుముందుకాలంలో అయతే ఇంటిలో ఉండి అందరి అవసరాలుతీర్చి వారికి ఆనందాన్నిఇచ్చేవారిమి కదా.
ఇపుడు లోకం పోకడ కనిపెట్టేశాం. ఆఫీసులో బాసు కోరినట్టు పని చేస్తాం. ఇటు ఇంటాయన కోరినట్టు చేసేస్తాం. మరోవైపు పిల్లల కోరికలు క్షణాల్లో తీర్చేస్తాం. కదూ మరి మనం దగ్గర ఆనందం కోకొల్లలుగా ఉంది. అందుకే దాన్ని లాక్కోవడానికి మనమీద దాడులు చేస్తున్నారు.
వారికి ఏం చేస్తే ఆనందం వస్తుందో తెలియజెప్పాల్సిన బాధ్యత మనదే అనుకొనేసి ఇక ముందుకు ఆలోచించి ఆ వెధవాయలకు ఇలా అన్నానని చిన్నబుచ్చుకోకండి ఎందుకంటే మనలను ఏడిపించుదాం అని యాసిడ్ దాడులు ఆఘాయత్యాలు, అమానుష చర్యలు చేసేవారు వెధవాయలు కాక మరేమవుతారు చెప్పండి. వారికి బుద్ధిరావాలంటే మనమే పూనుకోవాలి. బడులు, కళాశాలల్లో మార్కులను ఉత్పత్తి చేసే వస్తువులను తయారు చేస్తున్నట్టు ఉంది. ముందుగా వాటిని ప్రక్షాళన చేయాలి. అక్కడ నుంచి మొదలు పెట్టాలి. జీజియాబాయ తనకుమారుడిని ప్రపంచ విజేత గా చేయడానికి పురాణాలను ఆసరా తీసుకొందట. మనమూ ఈ కాలానికి తగ్గ వనరులను ఆలోచించి వారిలో బుద్ధి వికసించేట్టు చేయండి. దీనికి కాస్త ఉపాధ్యాయులు ఆసరా గా నిలవాలి. కళాశాలల యాజమాన్యం చేయూత నివ్వాలి. వారిలో నీతి నిజాయతీలు పెంచేవిధమైన చర్యలు తీసుకోవాలి. ఆ మనస్సానందానికి డబ్బు అవసరం లేదు. మన చుట్టూ ఉండే మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, మమతానుబంధాలు హేతువులు. ఇవి కావాలంటే కొనుక్కోవడానికి దొరకవు. కానీ మన చేతుల్లోనే చేతల్లోనే పుష్కలంగా లభ్యం అవుతాయి. పిల్లలు పసి మొగ్గలు. వాటిని వికసించే ముందే మంచి మందులు వేసి వాటిల్లో ఏవైనా దుర్గణాలైతే వాటిని ప్రేమతో వారి నుంచి దూరంచేస్తే మంచి పువ్వులు వికసించినట్టే పిల్లలూ మంచి పౌరులుగా ఎదుగుతారు. భారత దేశ ఔన్నత్యాన్ని పెంచుతారు.