జాతీయ వార్తలు

సల్మాన్ బెయిల్ రద్దుకు సుప్రీం ‘నో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు బెయిల్ రద్దు చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. 2002 హిట్ అండ్ రన్ కేసులో ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాంబే హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ ఎఫ్‌ఎంఐ కాలీఫుల్లా, జస్టిస్ అమితారాయ్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సుశీల బాయ్ హిమ్మత్‌రావు తరఫున న్యాయవాది మనోహర్‌లాల్ శర్మ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఖాన్ పోలీసు బాడీగార్డు రవీంద్ర పాటిల్ కుమారుడే సుశీల బాయ్. 2002 హిట్ అండ్ రన్ కేసులో రవీంద్రే ప్రత్యక్ష సాక్షి. తరువాత జరిగిన పరిణాల్లో అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సంచలం రేకెత్తించిన హిట్ అండ్ రన్ కేసులో మే 6న సల్మాన్‌ఖాన్‌ను కోర్టు దోషిగా నిర్ధాంచి జైలుశిక్ష విధించింది. అదే నెల 8న బాంబే హైకోర్టు బాలీవుడ్ నటుడికి బెయిల్ మంజూరు చేసింది. ఇంతకుముందు అంటే ఆగస్టు 31న ఖాన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుశీల బాయ్ పాటిల్ సుప్రీంలో పిటిషన్ వేశారు. అప్పుడూ హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలుశిక్షకు గురైన సల్మాన్‌ఖాన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శిక్షను రద్దుచేయాలంటూ అతడు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.