జాతీయ వార్తలు

మాతా సుతులకు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 50వేల పూచీకత్తుపై మంజూరు
స్వామి వాదనలు తోసిపుచ్చిన కోర్టు
ఫిబ్రవరి 20కి తదుపరి కేసు వాయిదా
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కొడుకు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పాటియాల మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై షరతులు లేని బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ హెరాల్డ్ నిధులు ఆస్తి పాస్తులను సోనియా, రాహుల్ కైవసం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ఆరేడు నిముషాలపాటు వాదోపవాదాలు విన్న తరువాత మేజిస్ట్రేట్ నిందితులు అందరికీ బెయిల్ మంజూరు చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదావేస్తూ తీర్పునిచ్చారు. తల్లీ కొడుకులకు బెయిల్ ఇవ్వరాదని వాదించిన సుబ్రహ్మణ్యస్వామికి దీంతో చుక్కెదురైంది. షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాలన్న విజ్ఞప్తినీ కోర్టు తిరస్కరించింది. దేశంనుంచి పారిపోకుండా సోనియా, రాహుల్ పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలన్న స్వామి డిమాండ్‌ను సైతం కోర్టు తోసిపుచ్చింది. కాంగ్రెస్ నేతలు ఎంతకైనా తెగించే అవకాశాలు ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని స్వామి వాదించారు. అయితే ఈ వాదనతో మేజిస్ట్రేట్ ఏకీభవించలేదు. సుదీర్ఘ చరిత్ర కలిగివున్న కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న నేతలు దేశంవిడిచి పారిపోరన్న నమ్మకం ఉన్నందున బెయిల్ ఇస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ తరపున కాకలుతీరిన న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, అశ్వనీకుమార్‌లు వాదించారు. హెరాల్డ్ కేసులో దోషులుగా ఉన్న అందరికీ 50వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. కేసులో దోషిగా ఉన్న శ్యామ్‌పిట్రోడా అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతున్నందున విచారణకు రాలేకపోయారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్టీ అధినేత్రి సోనియాకు పూచీకత్తుగా బెయిల్ పత్రాలపై సంతకం చేశారు. తమ్ముడైన రాహుల్‌కు ప్రియాంకా గాంధీ పూచీకత్తుగా నిలబడ్డారు. సంచలనం సృష్టించిన కేసుపై విచారణ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో కోర్టువద్ద గుమికూడి పెద్దపెట్టున నినాదాలిచ్చారు. కోర్టుచుట్టూ ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎస్పీజీతోపాటు ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన భద్రతాదళాలు కోర్టువద్ద మోహరించాయి. గుర్తింపుకార్డులున్న వారినే లోపలికి అనుమతించారు. సోనియా, రాహుల్ కోర్టు లోపలికి కారులో వెళ్లకుండా బయటేదిగి నడుచుకుంటూ కోర్టులోకి వెళ్లారు. వీరివెంట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆంటోనీ, గులామ్ నబీ అజాద్, మల్లిఖార్జున ఖర్గే, అంబికాసోనీ తదితరులు కోర్టు గదిలో ఉన్నారు. (చిత్రం) కోర్టు ఆవరణలోకి వస్తున్న సోనియా, రాహుల్