భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-92

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీరు నమ్మకంతో వచ్చారు. మీ నమ్మకమే మిమ్ములను బాగుచేసింది. భగవంతుని పైన నమ్మకం వుంటే చాలు. ఆ భగవంతుడే చల్లగా చూస్తాడు. అంతే నేను చేసింది ఏమీ లేదు. మీరు మీపిల్లలతో చల్లగా ఉండండి. అందిరనీ కాపాడేవాడు ఆ భగవంతుడే ’అన్నారు బాబా. అలా భీమాజీపాటిల్ తాను ఏమి చేస్తున్నా బాబా నామస్మరణ మాత్రం మానకుండా ఉండేవాడు.
మరోసారి బూటీ అనే అతనికి అతని జ్యోతిష్కులు గండం ఉందని చెప్పాడు అతడు ఎంతో భయపడిపోయి బాబా దగ్గరకు పరుగెత్తుకు వచ్చాడు.
‘‘బాబా నన్ను నీవు రక్షించాలి. మా జ్యోతిష్కులు నాకు ప్రాణ గండం ఉంది అని చెబుతున్నారు’అని చెప్పాడు.
‘నీవు ఆశ్రయించింది ఈ మసీదు తల్లిని. నీవు కూర్చుని ఉంది ద్వారకామాయి. ఏ గండమూ నిన్ను ఏమీ చేయదు. మరేం భయంలేదు నిశ్చంతగా ఉండు’’అన్నారు.
అట్లా బాబా దగ్గర అభయం తీసుకొని అతడు ఇంటి దారి పట్టాడు. దారిలో అతని పెద్ద పాము కనిపించింది అతడు వెంటనే భయపడి పోయి ఎలుగెత్తి బాబా అని అరిచాడు. ‘నేను ఇక్కడే నీ చెంతనే ఉన్నాను. నీకేమీ భయంలేదు. ఆ పాము నిన్ను ఏమి చేయదు. కళ్లు తెరిచి చూడు’అన్నారు. బూటీ భయంతో మెల్లగా కళ్లు తెరిచి చూసేసరికి పాము వెనుతిరిగి పోతోంది. పక్కనే బాబా చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. కొద్దిసేపటికీ అతనిలో భయం తగ్గింది. ఆలోచన వచ్చింది. నేను ఇపుడే కదా బాబాను మసీదులో చూసి వచ్చాను. నాతో కూడ రాలేదు కదా మరి ఇపుడు నా పక్కనే ఎలా ఉన్నారూ అనుకొంటూ మళ్లీ తేరిపారా చూశారు. అక్కడ ఎవరూ కనిపించలేదు. మళ్లీ అతనిలోభయం పొడచూపింది. వెంటనే అతడు వెనుతిరిగి మసీదుకు వెళ్లాడు.
‘ఏం బూటీ నీ దగ్గరే నడుస్తుంటే అనుమానంతో చూస్తావు నీవు భయపడుతున్నావు కదా నిన్ను మీ ఇంట్లో దిగబెడుదాం అనుకొని వచ్చాను. ’ నువ్వు ఏంటి మళ్లీ తిరిగి వచ్చావు అన్నారు.
అక్కడ కూర్చున్నవారు ఆశ్చర్యంగా చూస్తున్నారు ‘బాబా మీరు ఇక్కడ్నుంచి ఎక్కడికీ కదలలేదుకదా. మరి బూటీతో వెళ్లాను అంటారు’అన్నారు.
‘కావాలంటే అడగండి ’అన్నాడు బాబా.
‘అవును నిజమే. బాబా నాతో పాటే ఉన్నారు. కాని నేను తిరిగి చూసేసరికి లేరు. అందుకే భయంతో వచ్చేశాను. దారిలో పాము ఎదురైంది. ఇక నడ క సాగక వచ్చేశాను ’అన్నాడు బూటీ.
‘ఆ పాము నీ పూర్వజన్మకర్మానుసారంగా వచ్చింది. కాని నీవు నా దగ్గరకు వచ్చావు కదా. నేను వెళ్లమని చెప్పాను. వెళ్లిపోయింది. ఇంకా నీకు భయమెందుక’’అన్నారుబాబా.
అపుడు అతనికి జ్ఞానోదయం అయింది.
బాబా కనిపించాలనుకొంటే ఎక్కడైనా కనిపిస్తారు. చేయాలనుకొంటే ఏదైనా చేస్తారు. మనుష్యులల్లాగా ఎక్కడో ఒకచోటే ఉండడం, ఒకే పని చేయడం అనేవి ఆయన పనులు కావు బాబా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే అని అనుకొన్నాడు. అతని మనసు ఎంతో నిశ్చలంగా అనిపించింది.
అపుడు అక్కడే దాసుగణు కృష్ణుని గురించిన కథలు చెప్పడానికి ఉపక్రమిస్తున్నాడు. అక్కడే కూర్చున్నాడు బూటీ కూడా.
***
బాబాను నమ్ముకొన్నవారిని సదా కాపాడుతూనే ఉండేవాడు. భక్తులు వారి ఆత్రం కొలది బాబా మమ్మల్నితొందరగా రక్షించలేదని అనుకొనేవారు. బాబాను నమ్ముకొన్నవారికి ఎలాంటి జబ్బులైన దూరమైపోయేవి. అయితే జబ్బులు పోయేవిధమైన మందులేవీ ఆయన ఇచ్చేవారు కాదు. విరోచనాలు వచ్చాయి అంటే చారు తాగమని చెప్పేవారు దోసకాయలు తినమనేవారు అట్లానే వినేవారికి అది పథ్యంలాగా మందులాగా అనిపించేది కాదు. ఒకసారి కాకాదీక్షిత్ అనే ఆయనకు బాగా జ్వరం వచ్చింది. కాని, ఆ సమయంలోనే ఆయన బొంబాయి వెళ్లాలని ముందుగా నిశ్చయించుకొని ఉన్నాడు. అపుడు బాబా దగ్గరకు కాకా వచ్చి‘‘బాబా రాత్రినుంచి నాకు బాగా జ్వరం వస్తోంది. నేనుబొంబాయి వెళ్లాలి కదా.నేను నిన్ను విడిచి ఎలా వెళ్లను? ’’అని అడిగాడు.
ఆయన ‘‘మరేంఫర్లేదు నువ్వు బొంబాయి కి వెళ్లు’’ అన్నారు బాబా. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743