భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-95

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు అక్కడ బాబా‘ఏమిటో ఈ బాధలు... నాపైన అంతా పాలు, నీళ్లు అంతా పోసేస్తుంటారు. ఏం చేయాలో అర్థం కాలేదు ’అని అన్నాడు.
అనంతాచారి కి బాబా స్థానంలో గణపతి కనిపించారు. మెల్లగా తన తొండాన్ని ఊపుతూ నవ్వుతున్నట్టు కనిపించాడు. అనంతాచారి లోపలకి రాగానే ‘బాబా నన్ను క్షమించండి. మీరే నా గణపతి, నా నారాయణుడు, నా బాబా ఉన్నది ఒక్కడే దేవుడు. ఆయన మీరే. వారంతా విగ్రహాలుగా కనిపిస్తున్నారు. మీరు సజీవంగా కనిపిస్తున్నారు. నాకు అర్థమైంది. ఇక నుంచి మాట్లాడే నారాయణుడవి నాకు నీవే’’ అని కన్నీళ్లు తుడుచుకుంటూనే పాద నమస్కారం చేశాడు అనంతాచారి.
బాబా చిరునవ్వుతో సరి సరి నీవు హాయిగా నీ వృత్తిని చేసుకొంటూ మనస్సును భగవంతునిపై నమ్మకముంచు. అంతా భగవంతుడే చూసుకొంటాడు అనిచెప్పాడు.
అనంతాచారి ఎంతో సంతోషంతో ఇంటికి బయలుదేరాడు.
***
ఒకరోజు బాబా దగ్గరకు బొంబాయి నుంచి చాలామంది భక్తులు వచ్చారు. వారంతా దర్శనం చేసుకొని వెళ్లిపోయారు. వారిలో భీష్మ అనే అతను మాత్రం ఆ రాత్రి శిరిడీలోనే నిద్రచేస్తానని అక్కడే ఉండిపోయారు. ఆరోజు రాత్రి ఆయనకు కలలో ఓ విప్రుడు కనిపించి, కాగితంపైన సచ్చిదానంద అని రాసి చూపించి ‘ఇదే నీకు మేలు చేస్తుంది’అని చెప్పాడు. భీష్మ ఏదో మాట్లాడాలనుకొని నోరు తెరవగానే నిద్ర నుంచి మెలుకువ వచ్చేసింది. తెల్లవారి కలగురించి వారికి వీరికి చెప్పగా వారంతా ఇది సద్గురు నామంగా మంత్రదీక్ష ఇచ్చినట్లుగా అనిపిస్తుంది అని కలకు అర్థం చెప్పారు. నాకు సద్గురు కనిపించాడా అని అతడు ఆలోచిస్తూ బాబా దగ్గరకు వచ్చాడు.
భీష్మను చూడగానే బాబా‘‘ జై సచ్చిదానంద’’ అని అన్నారు. దాంతో భీష్మ నమస్కారం చేశాడు కాని, అతని మనసులో నా కలలో కనిపించింది విప్రుడు కదా. ఇతను ముస్లిం లాగా ఉన్నాడు. మరి బాబా ఎందుకు సచ్చిదానంద అంటున్నాడు. మరి నా గురువు ఎవరు నాకు అంతా అయోమయంగా ఉందే అనుకొంటూ అక్కడే కూర్చున్నాడు.
‘‘నేను బొంబాయి, పూనా, నాగపూర్ అంతా తిరిగి వచ్చాను. ఎక్కడికి వెళ్లాలన్నా నేను వెళ్లగలను కదా. ఓయి!్భష్మా! నీవు నాకు ఐదు లడ్డూలు ఇస్తానని చెప్పావు కదా సచ్చిదానంద ’’అన్నారు. అతడు మరింత ఆలోచనలకు గురైయ్యాడు. లడ్డూలు ఇస్తానని చెప్పానా ఎప్పుడు అంటూ ఆలోచిస్తున్నాడు.
మళ్లీ బాబానే ‘అవును నిజమే. ఇపుడు కాదు నీవు చెప్పింది చాలా ఏళ్ల క్రితం నీవు లడ్డూల సంగతి నాతో చెప్పావు. కాని అది మరిచిపోయినట్టు ఉన్నావు గుర్తు తెచ్చుకో...’’అన్నారు.
అతడు వౌనంగా నమస్కారం చేసాడు. ముస్లిములు, హిందువులు, క్రైస్తవులు ఇదంతా మీరు కల్పించుకున్న మతాలు విప్రులు, వైశ్యులు, శూద్రులు ఇవన్నీ కూడా మీరు కల్పించుకున్న కులాలు. భగవంతునికి మనమంతా సమానమే. ఏ కులంలో ఉన్నా ఏ పని చేసినా అది సర్వులకూ మేలు చేసేట్టు అయితే ఆ పనికి భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు. భగవంతుడు మిమ్ముల్ని సదా కాపాడుతుంటాడు. గుణాన్ని బట్టి కులవిభజన జరగలేదు. చేసే వృత్తులను బట్టి శక్తిని పలురూపాలుగా విభజించు కున్నారు. కాని, ఇపుడేమో ఆ కులాల పేర్లు చెప్పుకొని పోట్లాడు కుంటున్నారు. ఇది మంచిదేనా? అన్నారు బాబా. అక్కడ కూర్చునవారికి ఏమి సమాధానం ఇవ్వాలో తెలియక వౌనం పాటించారు
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743