భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-96

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యలో కులాలని, మతాలని చిచ్చులు పెట్టుకుని మీ వాదనలకు భగవంతుని లాక్కొస్తే భగవంతుడు ఎప్పటికీ క్షమించడు. ఉన్న భగవంతుడు ఒక్కడే మనమే మనకిష్టమొచ్చినట్లు పిలుస్తుంటాం. కాని ఉన్నది భగవంతుడే. అని అంటూ భీష్మను బాబా ఆశీర్వదించారు.
భీష్మకు మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అతడు వౌనంగానే తన బసకు వెళ్లాడు. మరునాడు తెల్లవారుఝామున నిద్రలేవగానే అనర్గళంగా రెండు పాటలు ఆయన పాడాడు. అంతకు ముందు వాటిని ఆయన పాడలేదు. ఇపుడు అనుకోకుండా రెండు పాటలు పాడాడు. దాంతో అతనికి వాటిని కాగితంపైన వ్రాయాలనిపించింది. వెంటనే అతడు రాశాడు.
ఆ తరువాత ఇవి బాబాకు చూపించాలి అనుకొన్నాడు. స్నానపానాదులు చేస్తున్నాడు. అపుడు ఇంతకుముందు కాలంలో బాబాను బాగా తెలిసి ఉన్నట్టు అతనికి అనిపించింది. బాబా నామాన్ని స్మరించగానే ఎక్కడలేని సంతోషం వేసింది భీష్మకు. అతడు గబగబా స్నానం పానం చేసుకొని వెంటనే ఆ పాటల కాగితాన్ని తీసుకొని వెళ్లి బాబా ముందు నిల్చున్నాడు.
అతడిని చూడగానే బాబా ‘ఇక ఏమి పాడు ’అన్నారు. తనను ఉద్దేశించే బాబా అన్నారని భీష్మ అనుకొన్నాడు. అతనికి చాలా సంతోషం వేసింది. బాబా సర్వాంతర్యామి అనుకొని మనసులో నమస్కారం చేసి ఆ పాటలను రెండింటి నీ పాడాడు.
బాబా ‘మరి మిగతా మూడు పాటలు ఎపుడు పాడుతావు’ అంటూ అతని తలపైన తన చేత్తో నెమిరారు. అంతే భీష్మ ఆశువుగా మరో మూడు పాటలు పాడేశాడు. బాబా చాలా బాగుంది అన్నారు.
అంతే వాటిని కాగితం పైన వ్రాసుకొన్నారు.
అప్పట్నుంచి బాబా దగ్గర హారతి ఇచ్చేసమయంలో అందరూ ఆ పాటలనే పాడసాగారు.
ఒకసారి హారతి సమయంలో దాసగణు వచ్చా రు. బాబాకు మధ్యాహ్న హారతి జరుగుతోంది. భీష్మ రాసి పాడిన పాటలను పాడుతున్నారు. దాసగణుకు ఎంతో ఆనందం వేసింది. తాను కూడా అలా బాబాపై పాడాలనుకొన్నాడు. వెంటనే అతడు అనుకోకుండానే బాబా పై పాట పాడాడు.
అలా హారతి సమయంలో బాబా పాటలను పాడడం మొదలైంది.
****
ఒకరోజు శిరిడీ నలుగురు అన్నదమ్ములు ఆస్తిపంపకాల్లో పేచీలు పడ్డారు. అందులో ఒకరు బాబా భక్తులు. అతడు మనసుబాగోలేక బాబా దర్శనం చేసుకొందామని వచ్చాడు.
అతనికి దాసుగణు కనిపించాడు.మొహం అంతా దీనంగా పెట్టుకొని వస్తున్న శివకాశి ను చూచి ‘ఏమోయి శివా.. ప్రపంచంలో ఉన్నబాధలంతా నీవే మోస్తున్నట్టు అలా వున్నాం వేమి?’ అని దాసగణు అడిగాడు.
‘ఏమి చెప్పమంటారుబాయి.. మీకు తెలుసుగదా నాకు ముగ్గురు అన్నదమ్ములు. మా నాన్నగారి ఆస్తిగా మాకు ఆరు ఎకరాల స్థలం, ఒక ఇల్లు వచ్చాయి. పంటపొలాలు పంపకం అయిపోయింది. కాని ఇల్లు ఉంది. దాన్ని విడగొట్టి అందరం తీసుకొని పోదాం అంటున్నారు. నేనే ఈ ఇంటిలో ఉంటాను. నా దగ్గర మా తల్లి గారుంటారు.
ఆమె వృద్ధురాలు. ఆమె ఆ ఇంట్లో మా నాన్నగారి జ్ఞాపకాలతో కాలాన్ని గడిపేస్తుంటుంది. ఇపుడు ఆ ఇల్లును అమ్మేద్దాం అంటే నా దగ్గర అంత డబ్బు లేదు. ఇల్లు దూరమైతే మేమెలా జీవించడం, మా అమ్మ ఏవౌతుంది అని ఆలోచిస్తున్నాను.’’అన్నారు.

-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743